ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Jr NTR Birthday Celebrations రాష్ట్రవ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలతో ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు

By

Published : May 20, 2023, 9:06 PM IST

Jr NTR Birthday Celebrations: హీరో జూనియర్‌ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతపురంలో ఆర్డీటీ, ఎన్టీఆర్ గ్లోబల్‌ కేర్‌ ఫౌండేషన్‌ అధ్వర్యంలో.. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ట్రైసైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. బాపట్ల జిల్లా అద్దంకిలో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ జండాలు పట్టుకొని.. బ్యాండ్ మేళాలతో.. బాణాసంచా కాల్చి చిందులు వేశారు.

Jr NTR Birthday Celebrations
జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్

Jr NTR Birthday Celebrations: జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా బాపట్ల జిల్లా అద్దంకిలో కళామందిర్ థియేటర్లో సింహాద్రి సినిమా సెకండ్ రిలీజ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు థియేటర్ ముందు కాసేపు సందడి చేశారు. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ జండాలు పట్టుకొని పట్టణ ప్రధాన రహదారిలో కలియతిరిగారు. బ్యాండ్ మేళాలతో.. బాణాసంచా కాల్చి చిందులు వేశారు. అనంతరం బర్త్ డే కేక్​ను కట్ చేసి.. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. అంతా బాగానే ఉన్నా.. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని కేకలు వేయటం స్థానికులను కాసేపు ఆలోచనలో పడేసింది.

అనంతపురంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ: పేదలకు, దివ్యాంగులకు సేవ చేస్తూ అభిమానాన్ని చాటడం ఎంతో గొప్ప విషయమని ఆర్డీటీ మహిళా సాధికారత డైరెక్టర్ విశా ఫెర్రర్ అన్నారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా అనంతపురంలోని ఎస్వీ థియేటర్ ఆవరణలో ఎన్టీఆర్ గ్లోబల్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ఆర్డీటీ మహిళా సాధికారత డైరెక్టర్ విశా ఫెర్రర్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ నరేంద్ర చౌదరి హాజరయ్యారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు సందడి చేశారు. దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు ట్రై సైకిలు అందజేశారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి చిత్రాన్ని థియేటర్లో ప్రదర్శించారు. అభిమానులు థియేటర్లో ఈలలు వేస్తూ సంబరాలతో అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ గ్లోబల్ కేర్ ఫౌండేషన్​కు దరఖాస్తు చేసుకుంటే ప్రతి నెలా కృత్రిమ అవయవాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అభిమానం అనేది దివ్యాంగులకు, పేదలకు సహాయం చేసే విధంగా ఉండటం అభినందనీయమన్నారు. మనం చేసే చిన్న సహాయమైనా వందమంది కలిస్తే పెద్ద సహాయంగా మారుతుందని తెలిపారు. మనకు ఉన్నంతలో అవసరంలో ఉన్న పేదలకు దివ్యాంగులకు సహాయం చేసేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆర్డీటీ మహిళా సాధికారత డైరెక్టర్ విశా ఫెర్రర్ కోరారు.

సత్యసాయి జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ కూడలి వద్ద జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ అభిమానులు కేక్ కట్ చేసి.. ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలువురు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రక్తదానం చేశారు.

Jr NTR Birthday Celebrations: ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details