ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"రాజకీయ గందరగోళాలకు తెరతీసే పరిస్థితి వచ్చింది"

By

Published : Oct 31, 2022, 3:49 PM IST

Somu Veerraju: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రి జగన్​పై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మీద నిలబడటం లేదని.. మాటలు మార్చి రాష్ట్రంలో రాజకీయ గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా ఇలాంటి గందరగోళానికి తెరతీసే పరిస్థితి వచ్చిందన్నారు.

Somu Veerraju
సోము వీర్రాజు

Somu Veerraju Comments: రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా రాజకీయ గందరగోళాలకు తెరతీసే పరిస్థితి వచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓటర్ల అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు అమరావతి మన రాజధాని అని.. ఇక్కడే తాను కూడా ఇల్లు కట్టుకుని ఉంటానని ముఖ్యమంత్రి​ అన్నారు. ఏ సందర్భంలోనూ విశాఖపట్నంలో రాజధాని పెడతామని చెప్పలేదన్నారు. ఇప్పుడు మాట తప్పి గందరగోళ పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టేసారని ఆరోపించారు. రాజధాని కోసం 35 వేల ఎకరాల భూమి అవసరం లేదని ఇప్పుడు మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాయలసీమలో సైతం అనేక ప్రాజెక్టులన్నీ అసంపూర్తిగా ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతో పథకాలు పెట్టి.. వాటికి తమ పేరును పెట్టుకొని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details