ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ద్విచక్ర వాహనాల దొంగగా మారిన ఆర్టీసీ డ్రైవర్.. అరెస్ట్ చేసిన పోలీసులు

By

Published : Dec 31, 2022, 5:09 PM IST

Bikes Thief Arrest: బాపట్ల జిల్లాలో శ్రీనివాసరావు కీర్తిపాటి అనే ఆర్టీసీ డ్రైవర్ దొంగగా మారాడు. వివిధ ప్రాంతాల నుంచి తొమ్మిది మోటార్ సైకిళ్లను ఎత్తుకెళ్లాడు. కాగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ మోటార్ సైకిళ్ల విలువ సుమారు 5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Two wheeler thief
ద్విచక్ర వాహనాల దొంగ

Bikes Thief Arrest: బాపట్ల జిల్లా బల్లికురవ మండలం, కొమ్మినేనివారి పాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు గతంలో ఆర్టీసీ డ్రైవర్​గా పనిచేశాడు. ఇతను చేసిన కొన్ని తప్పిదాల వల్ల ఆరు నెలల క్రితం అతన్ని ఉద్యోగంలో నుంచి తొలగించారు. మద్యం, పేకాటకు బానిసైన శ్రీనివాసరావు.. ఎలాగైనా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో నేర ప్రవృత్తిని ఎంచుకున్నాడు. బస్టాండుల్లో ఉంచిన మోటార్ సైకిళ్లను నకిలీ తాళాలతో ఎత్తుకెళ్లేవాడు.

ఈ విధంగా పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడి తొమ్మిది మోటార్ సైకిళ్లను ఎత్తుకెళ్లాడు. దొంగిలించిన మోటార్ సైకిళ్లను వేరే ప్రదేశానికి తరలిస్తుండగా పావులూరులో ఇంకొల్లు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు. దొంగిలించిన వాహనాల విలువ సుమారు 5లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఇతన్ని పట్టుకునేందుకు ఎస్సై నాయబ్ రసూల్ ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా విడిపోయినట్లు చెప్పారు. చివరికి పావులూరులో అతన్ని అదుపులోకి తీసుకొని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details