ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పన్నుల రాబడి రూ.80,853 కోట్లు.. కాగ్‌కు ఆర్థికశాఖ నివేదిక

By

Published : Dec 28, 2022, 9:58 AM IST

Telangana State Tax Revenue
కాగ్‌కు ఆర్థికశాఖ నివేదిక ()

Telangana State Tax Revenue: ఈ ఆర్థిక సంవత్సరం నవంబరు నెలాఖరు వరకు తెలంగాణ రాష్ట్ర రాబడులు, వ్యయం వివరాలను రాష్ట్ర ఆర్థికశాఖ కాగ్‌కు నివేదించింది. ఈ మేరకు రాష్ట్ర ఖజానాకు మొత్తం రాబడి అంచనాల్లో 50 శాతం రాగా వ్యయం అంచనాల్లో 50 శాతం పూర్తయింది. దీంతో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ద్వారా జీఎస్టీ, అమ్మకం పన్ను రూపంలో రూ.46,857 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి పన్నుల వాటా అంచనాల్లో 61 శాతం వచ్చింది.

Telangana State Tax Revenue : తెలంగాణ రాష్ట్రంలో పన్నుల రాబడి ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబరు నాటికి రూ.80,853 కోట్లకు (అంచనాల్లో 64%) చేరింది. పన్నేతర ఆదాయం రూ.9,138 కోట్లు (అంచనాల్లో 36%) సమకూరింది. అలానే రాష్ట్ర రుణాల లక్ష్యంలో 50% పూర్తయింది. నవంబరు నెలాఖరు వరకూ రాష్ట్ర రాబడులు, వ్యయం వివరాలను రాష్ట్ర ఆర్థికశాఖ కాగ్‌కు నివేదించింది. దీని ప్రకారం రాష్ట్ర ఖజానాకు మొత్తం రాబడి అంచనాల్లో 50% రాగా.. వ్యయం అంచనాల్లో 50% పూర్తయింది.

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ద్వారా జీఎస్టీ, అమ్మకం పన్ను రూపంలో రూ.46,857 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి పన్నుల వాటా అంచనాల్లో 61% వచ్చింది. గ్రాంట్‌ ఇన్‌ఎయిడ్‌ రూ.41 వేల కోట్లు వస్తుందని అంచనా వేయగా, రూ.6,623 కోట్లు (అంచనాల్లో 16%) మాత్రమే అందిందని, ఇది పూర్తి నిరాశాజనకంగా ఉందని ఆర్థికశాఖ తెలిపింది. మరోవైపు వేతనాలు, వడ్డీల చెల్లింపులు అంచనాల్లో 70% దాటగా.. పింఛన్ల రూపంలో చెల్లించాల్సిన మొత్తం అంచనాల్లో 94% చేరడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details