ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఆ ప్రాజెక్టు మాకొద్దు.. మా భూములు మాకే కావాలి'

By

Published : Jan 9, 2023, 9:24 PM IST

hydropower project

Farmers complaint to Collector: అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వం నిర్మించే హైడ్రో పవర్ ప్రజెక్టు కోసం తమ నుంచి బలవంతంగా భూములు లాగేసుకుంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గొడును స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గిరీషకు వినతి పత్రం ద్వారా తెలియజేశారు. తమ బాధను ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Hydro Power Project in Annamayya District: అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్ల గ్రామంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం తమ పంట భూములు బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని బాధిత రైతులంతా సోమవారం టీడీపీ నాయకులు, ప్రజాసంఘాల నాయకుల మద్దతుతో అన్నమయ్య కలెక్టరేట్​కు తరలివచ్చారు. తమ గోడును స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గిరీషకు వినతి పత్రం ద్వారా తెలియజేశారు. ఏడాదికి మూడు పంటలు పండుతున్న భూములతో పాటూ.. మామిడి తోటలు వేసుకుని అవే జీవనాధారంగా జీవిస్తున్నామని తెలిపారు. తమకు ఇతర వేరే ఏ మార్గం లేక భూములపైన ఆధారపడ్డామని రైతులు వెల్లడించారు. అలాంటి భూములు ఉన్నపళంగా ప్రభుత్వం లాక్కుంటే తమ బతుకులు వీధిన పడతాయని రైతులు వాపోయారు.

అంతేకాకుండా నీటిని పవర్ ప్రాజెక్టు కోసం తోడేస్తే, తమ పంట పొలాలు బీడుగా మారుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు నాలుగు గ్రామాలపై ప్రభావం పడుతుందని తెలిపారు. తామంతా వ్యవసాయ భూములను వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందని బాధిత రైతులు వాపోయారు. ఇటీవల గ్రామంలో అధికారులు నిర్వహించిన అభిప్రాయ సేకరణ సమావేశానికి వైసీపీ నాయకులు, మద్దతుదారులు మాత్రమే హాజరైనట్లు వెల్లడించారు. ప్రాజెక్టు ఏర్పాటు అత్యవసరమని చెప్పడంతో వారి అభిప్రాయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకున్నారని వెల్లడించారు. రైతులు చెప్పే మాటలు ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి తమ భూములను తీసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకున్నారు. లేనిపక్షంలో తాము గ్రామాలు వదిలి వెళ్లి పోవాల్సి వస్తుందని వంగిమళ్ల గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా రైతుల నిరసనలు

రైతుల్లో ఇప్పటికీ ఆందోళన ఉంది. సుమారు 300ల ఎకరాలను రైతుల వద్ద నుంచి సేకరించాలనుకుంటున్నారు. ఈ అంశంపై రైతులు ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చెపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో సైతం రైతులను ఇబ్బంది పెట్టారు. భూములు ఇవ్వకపోతే.. నష్టపరిహారం సైతం రాదంటూ రైతుల్లో భయాన్ని సృష్టిస్తున్నారు. మాండవ్య నది పరిసరాల్లో ఉన్న ఆయా గ్రామాల్లో ఈ ప్రాజెక్టు వల్ల నీటి లభ్యతకు ప్రమాదం ఏర్పడుతుంది. ప్రభుత్వం స్పందించకుంటే టీడీపీ రైతుల తరఫున పోరాటం చేస్తుంది. -భాను గోపాల్ రాజు, టీడీపీ నేత

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details