ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

By

Published : Jan 26, 2022, 5:45 AM IST

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

road accident
road accident

అనంతపురం జిల్లా పరిగి సమీపంలోని కొడికొండ జాతీయ రహదారిలో మంగళవారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు పరస్పరం ఢీకొన్న సంఘటనలో వాహన చోదకులు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన సమాచారం మేరకు.. పరిగి సీతారామపురం కాలనీకి చెందిన అర్జున్‌కుమార్‌(25), మడకశిర మండలం ఎల్లోటికి చెందిన మంజునాథ్‌ (24) ప్రమాదంలో మృతిచెందగా.. గోరంట్లకు చెందిన విజయ్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details