ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితుల మృతి'

By

Published : Feb 24, 2021, 4:06 AM IST

అనంతపురం జిల్లా చిగిచెర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. టీటీసీ కోచింగ్​ పూర్తి చేసుకుని స్నేహితులిద్దరూ.. తిరిగి స్వస్థలాలకు ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో ఘటన చోటుచేసుకుంది.

friends died in road accident at anatapur district
'రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితుల మృతి

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు ఇద్దరూ స్నేహితులు. వారిద్దరూ అనంతపురం నుంచి ధర్మవరం వైపు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తుండగా.. ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో మృతి చెందిన యువకులు జగదీష్ (22), హోసన్న (23) లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ టీటీసీ పూర్తి చేసి అనంతపురంలో డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నారు. కోచింగ్ పూర్తి కావడంతో అనంతపురం నగరానికి చెందిన హోసన్న ద్విచక్ర వాహనంలో.. జగదీశ్​ను స్వగ్రామమైన కొత్తచెరువు మండలం నారే పల్లికి తీసుకెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details