ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బైరవానితిప్ప ప్రాజెక్టులో మృతదేహాల కలకలం.. అసలేం జరిగింది..?

By

Published : Sep 21, 2022, 3:57 PM IST

Updated : Sep 21, 2022, 10:15 PM IST

Dead Bodies
Dead Bodies

Two Dead Bodies were Found: బైరవానితిప్ప (బీటీ) ప్రాజెక్టులో రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమయాయి. మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుల్లో మహిళతో పాటు.. బాలుడు ఉన్నట్లు గుర్తించారు. మృతులు కర్ణాటకవాసులు కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Dead Bodies were Found in the B.T Project :బైరవానితిప్ప (బీటీ) ప్రాజెక్టులో మృతదేహాల కలకలం నెలకొంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం బైరవానితిప్ప ప్రాజెక్టులో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. మహిళ, బాలుడి మృతదేహాలను గుమ్మగట్ట పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కర్ణాటక నుంచి వస్తున్న వేదావతి హగరి గుండా మృతదేహాలు కొట్టుకుని వచ్చి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతులు కర్ణాటకవాసులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నదిలో ప్రవహంలో ఒక మృతదేహం:మరో ఘటనలో నదీ ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తులలో ఒకరి మృతదేహం లభ్యమైంది. బ్రహ్మసముద్రం మండల పరిధిలోని వేపులపర్తి సమీపంలో వేదవతి నది ప్రవాహంలో ఇద్దరు యువకులు గల్లంతు కాగా.. ఒకరి మృతదేహం లభ్యమైంది. మంగళవారం సాయంకాలం బ్రహ్మసముద్రం మండలం గొల్లల దొడ్డి గ్రామానికి చెందిన బసవరాజు, అజ్జయ్య దొడ్డి గ్రామానికి చెందిన శేఖర్​లు మోటార్ సైకిల్​పై వేపులపర్తి వైపు నుంచి రాయదుర్గం వెళ్తున్నారు. ఈ క్రమంలో వేదవతి నదీ ప్రవాహంలో పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాయదుర్గం అగ్నిమాపక సిబ్బంది, కళ్యాణదుర్గం ప్రాంతంలోని గజ ఈతగాళ్లతో రెవెన్యూ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నది ప్రవాహానికి కొట్టుకుపోయిన బసవరాజు మృతదేహాం ఈ రోజు లభ్యమైంది. కిలోమీటర్ దూరంలో ముళ్ళ కంపలో చిక్కుకున్న బసవరాజు మృతదేహాన్ని గజ ఈతగాళ్లు గుర్తించారు. అయితే గల్లంతైన మరో యువకుడు శేఖర్ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 21, 2022, 10:15 PM IST

ABOUT THE AUTHOR

...view details