ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

By

Published : Mar 23, 2021, 9:56 AM IST

కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 15 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ప్రత్యేక పూజలతో అర్చకులు అంకురార్పణ చేశారు.

sri lakshmi narasimha swamy brahmotsavam starts at kadiri
కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. 15 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలను యాగశాలలో ప్రత్యేక పూజలతో అర్చకులు అంకురార్పణ చేశారు. ఖాద్రీపురాధీశుడి ఆలయ సర్వసైన్యాధ్యక్షుడు విశ్వక్షేనుడికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయానికి ఈశాన్యదిశలో సైన్యాధిపతికి ప్రత్యేకపూజలు నిర్వహించిన అనంతరం విశ్వక్సేనుడిని పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉత్సవాల ప్రారంభానికి గుర్తుగా విశిష్టపూజలు చేసి ఆ మట్టిని యాగశాలకు తీసుకొచ్చారు. వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల ఐదోతేదీ వరకు జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details