ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైభవంగా ప్రారంభమైన సిద్ధేశ్వర స్వామి సిరిమాను ఉత్సవం

By

Published : Feb 25, 2020, 8:49 PM IST

అనంతపురం జిల్లా హేమావతిలో సిద్ధేశ్వర స్వామి సిరిమాను ఉత్సవం వైభవంగా ప్రారంభమైంది. సిరిమాను ఎక్కి ఎమ్మెల్యే తిప్పేస్వామి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

sirimanu jathara
వైభవంగా ప్రారంభమైన సిరిమాను ఉత్సవం

వైభవంగా ప్రారంభమైన సిరిమాను ఉత్సవం

అనంతపురం జిల్లా అమరాపురం మండలం హేమావతిలో శ్రీ హేంజేరు సిద్ధేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సిరిమాను ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులు శరీరానికి గంధం రాసుకుని పూలదండలు ధరించి సిరిమాను వద్దకు చేరుకుంటారు. సిరిమానుకున్న తాడు సహాయంతో గాలిలో దేవుడి విగ్రహం ముందు తిరుగుతూ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఉత్సవంలో మడకశిర ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి పాల్గొని సిరిమాను ఎక్కి మొక్కులు తీర్చుకున్నారు.

ఇవీ చూడండి:

మద్దిలేరు వాగుపై వంతెన కూల్చివేత..!

ABOUT THE AUTHOR

...view details