ఆంధ్రప్రదేశ్

andhra pradesh

VEGETABLE RATES: అనంతలో ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు

By

Published : Jun 25, 2021, 8:05 PM IST

అనంతపురం జిల్లాలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సాగు పూర్తిగా తగ్గటంతో.. కర్ణాటక నుంచి వస్తున్న కూరగాయల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా వేళ కొనుగోళ్లు కష్టంగా ఉన్నాయని వినియోగదారులు వాపోతున్నారు.

అనంతలో ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు
అనంతలో ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు

అనంతలో ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు

అనంతపురం జిల్లాలో కరోనా విజృంభణ కారణంగా... కొన్ని నెలలుగా చాలామంది రైతులు కూరగాయల సాగు చేయలేదు. దీనివల్ల జిల్లా ప్రజల అవసరాలకు కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆ రాష్ట్రానికి చెందిన టోకు వ్యాపారులు గ్రేడింగ్ అనంతరం రెండు, మూడో రకం నాణ్యత గల కూరగాయలను అనంతపురం జిల్లాకు తరలిస్తున్నారు. స్థానికంగా ఉత్పత్తి తగ్గడం వల్ల నాణ్యత అంతగా లేనివాటికీ ధర అధికంగా ఉంటోంది.

ఈ నెల 21 నుంచి హోటళ్లు, ఆహారశాలలు పగటిపూట తెరుచుకోవటంతో.. కూరగాయలకు డిమాండ్ పెరిగి ధరలకు రెక్కలొచ్చాయి. కర్ణాటకలోని గౌరిబిదనూర్‌ నుంచి తీసుకొచ్చే టమోటాల రేటు బాగా ఎక్కువగా ఉంది. ధరలు పెరుగుతుండటం వల్ల అమ్ముకోవడం కంటే, నష్టమే ఎక్కువని చిరు వ్యాపారులు అంటున్నారు. కూరగాయల ధరలు పెరగడంతో చాలా మంది సామాన్యులు ఆకుకూరల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ధరలు భరించలేకున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడో దశ కరోనా హెచ్చరికల దృష్ట్యా, కూరగాయలకు ఇబ్బంది ఏర్పడకుండా.. జిల్లాలో సాగు పెంచేలా ఉద్యానశాఖ ప్రణాళికలు రూపొందించాలని ప్రజలు కోరుతున్నారు.


ఇదీ చదవండి:

NGT: రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణంలో ఏపీ తీరుపై ఎన్జీటీ ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details