ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ప్లీజ్ ఒక్క తడి' ! పంటకు నీరందక రైతుల కంట తడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2023, 2:39 PM IST

Police Stopped Payyavula Keshav In Anantapur District : అనంతపురం అన్నదాతల ఆవేదన పట్టించుకోవాలని వారు ఆందోళనకు దిగారు. ఎంతో కష్టపడి పండించిన పంట చేతికందడానికి నీరందించమంటే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసన సెగలకు దారి తీసింది. అధికారులు ఒక్క తడికి నీరివ్వడానికి వెనకాడితే వారికి చావే దిక్కని దీనంగా అర్థిస్తున్నారు.

police_stopped_payyavula_keshav_in_anantapur_district
police_stopped_payyavula_keshav_in_anantapur_district

'ప్లీజ్ ఒక్క తడి'! పంటకు నీరందక రైతుల కంట తడి - పయ్యావుల​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Police Stopped Payyavula Keshav in Anantapur District :సాగునీటి కోసం అనంత రైతులు రోడ్డెక్కారు. కనీసం ఒక్క తడి ఇవ్వమంటూ కదం తొక్కారు. లేదంటే 300 కోట్ల రూపాయల విలువైన పంటలు కోల్పోతామని ఆందోళన వెలిబుచ్చారు. ఆ పరిస్థితి వస్తే మూకుమ్మడిగా పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదంటూ వాపోయారు. రైతుల గోడు పట్టించుకోని ప్రభుత్వం వారికి మద్దతుగా గళమెత్తిన పయ్యావుల కేశవ్‌ను అడ్డుకుని అదుపులోకి తీసుకుని చేతులు దులుపుకుంది.

'కేవలం ఒక్క తడికి నీళ్లడుగుతున్నా సర్కారుకు మనసు రావడం లేదు' - రైతులతో కలిసి పయ్యావుల ఆందోళన

Anantapur Farmers Protest For Water Source to Crops : గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌కు నీళ్లు విడుదల చేయాలంటూ అనంతపురం జిల్లా ఉరవకొండ రైతులు ఆందోళనకు దిగారు. దాదాపు 30 వేల ఎకరాల్లో మిరప, జొన్న, పత్తి, వేరుశనగ పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదంటూ ముష్టూరు వద్ద రోడ్డుపై బైఠాయించారు. రైతులకు మద్దతుగా తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌తోపాటు జనసేన, వామపక్ష నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ఎకరాకు లక్ష నుంచి లక్షన్నర పెట్టుబడి పెట్టామని ఒకట్రెండు తడుల నీళ్లిస్తే చివరిదశలో ఉన్న పంటలను కాపాడుకుంటామని వేడుకున్నారు. స్థానికంగా పంటలు ఎండుతుంటే నీళ్లివ్వకుండా మంత్రి పెద్దిరెడ్డి గొప్పల కోసం హంద్రీనీవా ద్వారా పుంగనూరుకు నీటిని తరలించడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

కౌలు రైతును నిండా ముంచిన మిగ్‌జాం తుపాను-ఉదారమంటూ ఉత్తమాటలు వల్లెవేస్తున్న సీఎం జగన్‌
Farmers Problems Due to Drought Conditions :2016లో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పయ్యావుల కేశవ్‌ దగ్గరుండి నీళ్లిచ్చే ఏర్పాటు చేశారని రైతులు గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదని నిలదీశారు. లక్షలు పెట్టుబడి పెట్టి పంటలేశామని, నీళ్లిచ్చి ఆదుకోకుంటే చావే గతి అంటూ అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

Payyavula Keshav :ప్రభుత్వానికి ఉరవకొండలో ఓట్లు తొలగించడంపై ఉన్న శ్రద్ధ రైతులకు నీళ్లివ్వడంపై లేదని పయ్యావుల మండిపడ్డారు. పుస్తెలమ్మి, పిల్లల చదువుల్ని పణంగా పెట్టి లక్షల రూపాయలు ఖర్చు చేసిన రైతులను ఆదుకోవాలని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ చేశారు.

Farmers Dhrana :దాదాపు 2 గంటలకు పైగా సాగిన రైతుల ధర్నాతో ముష్టూరు వద్ద ట్రాఫిక్‌ స్తంభించింది. పయ్యావుల కేశవ్‌ ఉంటే రైతులను కదిలించడం కష్టమని భావించిన పోలీసులు ఆయన్ను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. తొలుత స్టేషన్‌కు తీసుకెళ్లాలనుకున్నా, మళ్లీ వారి ఆలోచన మార్చుకుని ఆ తర్వాత కేశవ్‌ను ఇంట్లో వదిలిపెట్టారు.

తుపాను ప్రభావంతో నిండామునిగిన మినుము రైతులు- పట్టించుకోని ప్రభుత్వం, ఆర్బీకే అధికారులు

ABOUT THE AUTHOR

...view details