ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నాటు సారా తయారీ స్థావరాలపై దాడి.. బెల్లం ఊట ధ్వంసం

By

Published : Jul 11, 2021, 7:38 PM IST

అనంతపురం జిల్లా పామిడి మండలంలోని పలు గ్రామాల్లో నాటుసారా తయారీ స్థావరాలపై పక్క సమాచారం అందుకున్న పోలీసుల ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

police raid
నాటు సారా తయారీ స్థావరాలపై దాడి

అనంతపురం జిల్లా పామిడి మండలం దిగువ తండా గ్రామంలో నాటుసారా స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు చేశారు. నాటు సారా తయారు చేస్తున్నారని తమకు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి ఈ దాడులు చేపట్టినట్లు ఎస్సై చాంద్​ బాషా తెలిపారు. కొండ గుట్టల్లో సోదాలు చేసినట్టు తెలిపారు.

సారా తయారీకి సిద్ధం చేసిన 800 లీటర్ల బెల్లం ఊటతో పాటు, తయారీకి ఉపయోగించే 40 కేజీల బెల్లాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశానట్లు వెల్లడించారు. పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న తయారీదారులు అక్కడి నుండి పరారైనట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details