ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చేనేత మగ్గాలు పరిశీలించిన జిల్లా సంయుక్త కలెక్టర్ పద్మావతి

By

Published : Jun 8, 2020, 6:45 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నేతన్న నేస్తం లబ్ధిదారుల ఎంపికలో జిల్లా సంయుక్త కలెక్టర్ పద్మావతి సోమందేపల్లిలోని చేనేత మగ్గాలను పరిశీలించారు.

ananthapuram district
చేనేత మగ్గాలను పరిశీలించిన జిల్లా సంయుక్త కలెక్టర్ పద్మావతి

అనంతపురం జిల్లా సోమందేపల్లిలోని చేనేత మగ్గాలను జిల్లా సంయుక్త కలెక్టర్ పద్మావతి పరిశీలించారు. రెండో విడత నేతన్న నేస్తం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఎంపిక చేయటానికి అధికారులు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి చేనేత మగ్గాలను సక్రమంగా ఉపయోగిస్తున్నరా..లేదని తనిఖీలు చేస్తున్నారు. సోమందేపల్లిలోని పలు కాలనీలో ఉన్న చేనేత కార్మికుల ఇళ్ల వద్దకు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, మండల అధికారులతో కలిసి స్థితిగతులను పద్మావతి పరిశీలించారు. పలువురు లబ్ధిదారులు తమకు అర్హత ఉన్నప్పటికీ నేతన్న నేస్తం అందడం లేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. లబ్ధిదారుల యొక్క ఆధార్ కార్డు, చేనేత మగ్గాలు అవసరమైన ముడి సరకు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details