ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అవినీతికి పాల్పడిన 267 మంది వాలంటీర్లను తొలగించాం: వెంకట్రామిరెడ్డి

By

Published : Aug 25, 2021, 8:01 PM IST

రాష్ట్రంలో కొందరు వాలంటీర్లలో అవినీతి పెచ్చుమీరిందని ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన 267 మంది వాలంటీర్లను తొలగించామని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన వాలంటీర్లపై క్రిమినల్‌ కేసులు పెట్టామన్నారు.

mla venkatramireddy
వెంకట్రామిరెడ్డి

రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై వైకాపా ఎమ్మెల్యే వెంకట్రామి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థలో అవినీతిపై ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వాలంటీర్లలో అవినీతి పెచ్చుమీరిందని మండిపడ్డారు. కరోనా వేళ తాము ప్రజల్లోకి రాకపోవడాన్ని అలుసుగా తీసుకున్నారని దుయ్యబట్టారు. అవినీతికి పాల్పడిన 267 మంది వాలంటీర్లను తొలగించామని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన వాలంటీర్లపై క్రిమినల్‌ కేసులు పెట్టామన్నారు.

గ్రామ సచివాలయాల్లో అవినీతికి పాల్పడిన 10 మందికి ఛార్జ్‌మెమోలు జారీ చేశామని ఎమ్మెల్యే అన్నారు. అవినీతికి పాల్పడిన మరికొందరిని సస్పెండ్‌ చేశామన్నారు. పథకాల అమలులో డబ్బులు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. సీఎం ఆశయాన్ని వమ్ము చేస్తున్న వాలంటీర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి

CM JAGAN: 'కొవిడ్ మార్గదర్శకాలు పాటించకపోతే కఠిన చర్యలు'

ABOUT THE AUTHOR

...view details