ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కలుపు మొక్కలను తీసేయాలనుకున్నాం.. కానీ అంతలోనే'

By

Published : Feb 4, 2023, 4:00 PM IST

Minister Goverdhan reddy : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి ఆయన వెళ్లిపోవడంతో దరిద్రం వదిలిపోయిందని పేర్కొన్నారు. కలుపు మొక్కలను తీసేయాలనుకున్నాం.. విషయం గ్రహించి ముందుగానే వెళ్లిపోయారంటూ కాకాని చెప్పారు.

శ్రీధర్ రెడ్డిపై మంత్రి కాకాని ఫైర్
శ్రీధర్ రెడ్డిపై మంత్రి కాకాని ఫైర్

Minister Goverdhan reddy Comments on Kotamreddy : సమాజంలో విలువ, విశ్వసనీయత ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ, శ్రీధర్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి అన్నారు. అనంతపురంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల సమావేశానికి వచ్చిన మంత్రి.. స్వంత పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని విమర్శించారు. శ్రీధర్ రెడ్డిని ప్రశ్నించేవారిని పెద్దగొంతు పెట్టుకొని మాట్లాడితే భయపడతాం అనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి రెండుసార్లు అవకాశం ఇచ్చారు.. సీఎం పక్కన ఉన్నందుకే శ్రీధర్ రెడ్డికి విలువ ఉంది.. లేకపోతే లేదన్నారు.

శ్రీధర్ రెడ్డిపై మంత్రి కాకాని ఫైర్

తన వద్ద ఫోన్ ట్యాపింగ్ ఆధారాలున్నాయని చెబుతున్న శ్రీధర్ రెడ్డి.. విచారణ కోరవచ్చు, కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు. శ్రీధర్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోతే దరిద్రం వదిలిపోయినట్లేనని, తెదేపా చేరడంతోనే ఆ పార్టీలో ముసలం ప్రారంభమైంది. ఈ విషయం నెల్లూరు జిల్లాలో విచారణ చేయిస్తే స్పష్టమవుతుంది. అమాయకుల ఇంటి మీదకు దౌర్జన్యం చేస్తే కేసులు పెట్టరా..? కలుపు మొక్కలను తీసేయాలనుకున్నాం.. విషయం గ్రహించి ముందుగానే వెళ్లిపోయారు. -కాకాని గోవర్దన్ రెడ్డి, మంత్రి

దేశానికే ఆదర్శం : రాష్ట్రంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి చెప్పారు. అనంతపురంలో ఎఫ్​పీఓల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఈ కేంద్రాల ద్వారా రైతుల ముంగిటకే అనేక సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎఫ్​పీఓల బలోపేతానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని, ఇంకా సమస్యలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నందున తప్పనిసరిగా వాటిని పరిష్కరిస్తామన్నారు. మంచి పాలకులు ఉంటే ప్రకృతి సహకరిస్తుందని రాష్ట్రంలో స్పష్టంగా తెలుస్తోందన్నారు. వర్షాలు పుష్కలంగా కురుస్తుండటంతో ఒక్క మండలం కూడా కరవు జాబితాలోకి ఎక్కకపోవటం ప్రకృతి సహకరించి మంచి పంటలు వస్తుండటమేనని మంత్రి చెప్పుకొచ్చారు.

రైతులంటే ఎంతో అభిమానం : స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉష శ్రీచరణ్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం చాలా చేస్తోందన్నారు. తాను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చానని, రైతులంటే తమకు ప్రత్యేక అభిమానం అన్నారు. సదస్సుకు హాజరైన మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి మాట్లాడుతూ.. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దక్కాలంటే ఎఫ్​పీఓలు ఏర్పాటు చేసుకొని నేరుగా మార్కెటింగ్ చేసుకోవాలని చెప్పారు. తాము తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ చేయటానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని పలువురు రైతులు కోరారు. ఉత్పత్తులను విలువ ఆధారితం చేసుకోటానికి అవసరమైన రాయితీలు ఇవ్వాలని మంత్రి గోవర్దన్ రెడ్డిని కోరారు. రసాయనిక ఎరువుల ప్రోత్సహించే బదులుగా సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్న ఎఫ్ పీఓలకు చేయూత అందించాలన్నారు.

ఇవీచదవండి :

ABOUT THE AUTHOR

...view details