ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనంతపురంలో భూ కుంభకోణం, 14.9 ఎకరాల భూమి హాంఫట్​

By

Published : Aug 25, 2022, 4:23 PM IST

Land scam
భూ కుంభకోణం

Land scam అనంతపురం జిల్లాలో భూ కుంభకోణం జరిగింది. ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయుడి భూమి కాజేసినట్లు సమాచారం. ఆధార్‌ కార్డులో ఫోటో మారటంతో అనుమానం వ్యక్తం చేసిన బాధితుడు, ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. అసలేం జరిగిందంటే.

Land scam: అనంతపురం నగర శివారులో మరో భూమి కుంభకోణం వెలుగుచూసింది. రాచానపల్లి వద్ద విశ్రాంత ప్రధానోపాధ్యాయుడికి చెందిన 14.9 ఎకరాల భూమి కాజేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయనకు సంబంధించిన ఆధార్ కార్డు పోస్టులో రావటంతో.. అందులో ఫోటో మార్పు జరిగినట్లు గుర్తించారు. తన ఆధార్ మార్పుతో ఏదో అక్రమం జరిగినట్లు గుర్తించిన బాధితుడు.. స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీశారు. ఆయన భూమిని.. ఆయన పేరు గల వ్యక్తి ఇతరులకు రిజిస్ట్రేషన్​ చేయించినట్లు గుర్తించారు. దీంతో ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేయగా.. డీఎస్పీని దర్యాప్తు చేసేందుకు ఆదేశించారు. దర్యాప్తు చేపట్టిన త్రీటౌన్ పోలీసులు.. శ్రీనివాసులు, శేఖర్, ఇంతియాజ్, సురేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా కుట్ర బహిర్గతమైంది.

ఇప్పటికే వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కుట్రలో పలువురు ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు గుర్తించారు. కుట్రలో భాగస్వాములకు కోట్ల రూపాయలు ముట్టినట్లు తెలిసింది. ఈ కేసులో మరో ఐదుగురిని ఆదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details