ఆంధ్రప్రదేశ్

andhra pradesh

24 గంటల్లోపు సమాధానం ఇవ్వాలి లేదా ధర్నా చేపడతా: జేసీ ప్రభాకర్ రెడ్డి

By

Published : Feb 15, 2023, 2:16 PM IST

JC Prabhakar Reddy : పెన్నా నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లీజుదారులకు అనుమతి ఉందా లేదా అధికారులు పరిశీలించి 24 గంటల్లోపు సమాధానం ఇవ్వాలని ఆయన తాడిపత్రి పట్టణంలోని మైనింగ్ ఏడీ సుబ్రహ్మణ్యానికి మాజీ ఎమ్మెల్యే వినతిపత్రం అందించారు. ఇసుక అక్రమాలను నిరూపిస్తానని.. అలా నిరూపించలేకపోతే ఊరు నుంచి బహిష్కరించండి అంటూ సవాల్ విసిరారు. ఇసుక అక్రమాలను అడ్డకునేందుకు వెళ్తే నాపై కేసులు పెట్టారు.. అసలు అక్కడ ఏం జరుగుతోందో.. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

JC Prabhakar Reddy
JC Prabhakar Reddy

JC Prabhakar Reddy : అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని పెన్నా నదిలో ఇసుక అక్రమాలను నిరూపిస్తానని.. అలా నిరూపించలేకపోతే ఊరు నుంచి బహిష్కరించండి అంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. పెద్దపప్పూరులో ఇసుక అక్రమాలను చూసేందుకు వెళ్తే నాపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. అసలు అక్కడ ఏం జరుగుతోందో.. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. పెద్దపప్పూరు వద్ద పెన్నా నదిలో జరుగుతున్న ఇసుక అక్రమాలను ఆయన వివరించారు.

ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇసుకను మనుషులతోనే రోజుకు 20 మంది చొప్పున తవ్వాలని.. 300 రోజులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే లోడింగ్ చేయాలన్నారు. ఒకరోజుకు 75 ట్రాక్టర్లు లేదా 15 టిప్పర్లు మాత్రమే తోలుకోవాలన్నారు. కానీ అక్కడ మాత్రం 200 హెచ్​పీ సామర్ధ్యం గల ఐదు మిషన్​లతో రాత్రింబవళ్లు పని చేస్తున్నారని.. 200 టిప్పర్లు, 80 ట్రాక్టర్లలో లోడింగ్ చేస్తున్నారన్నారు. పెన్నానదిలో లోడింగ్​కి 23 టన్నుల ఇసుకకు 8550 రూపాయలు వసూలు చేస్తున్నారు.. కానీ మార్కెట్​ డిమాండ్​ని బట్టి రూ.16వేలు నుంచి రూ. 40వేల వరకు దండుకుంటున్నారని అన్నారు.

లీజుదారులకు అనుమతి ఉందా లేదా :ఇసుక అక్రమాలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత జెసి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న లీజుదారులకు అనుమతి ఉందా లేదా అధికారులు పరిశీలించి 24 గంటల్లోపు సమాధానం ఇవ్వాలని ఆయన తాడిపత్రి పట్టణంలోని మైనింగ్ ఏడీ సుబ్రహ్మణ్యానికి వినతిపత్రం అందించారు. ఇప్పటికే ఇసుక తరలింపుతో చాగల్లు ప్రాజెక్టు పరిధిలో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో 24 గంటల తర్వాత కార్యాలయం ముందు ధర్నా చేపడతానని వారికి తెలిపారు. గతంలోనూ అనేకసార్లు సమస్యను ప్రస్తావించినా.. అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఇసుక తరలింపు ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపట్టడానికి వెనకాడబోమని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details