ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనంతలో అకాల వర్షం.. ఆవేదనలో రైతులు

By

Published : Apr 15, 2021, 1:56 PM IST

అనంతపురంలో కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిర్చి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గాలివాన కారణంగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.. అధికారులు పట్టించుకోకపోవటంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

haeavy rains
అకాల వర్షాలు

అకాల వర్షాలు

అకాల వర్షం కారణంగా అనంత రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత రాత్రి కురిసిన ఈదురు గాలులు, భారీ వర్షానికి మిర్చి, అరటి, వేరుశెనగ పంటలకు భారీ నష్టం వాటిల్లింది.
మిర్చి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పుడే తక్కువ ధర పలుకుతున్న మిర్చి ఈ వర్షం కారణంగా రేటు మరింత పడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఉరవకొండ, విడపనకల్ మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్నిచోట్ల అరటి చెట్లు నేలకొరిగాయి. అకాల వర్షం రావడంతో తీవ్రంగా నష్టపోయామని.. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు

గాలి వానలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా..

జిల్లాలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలివానకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగి.. అర్ధరాత్రి నుంచి మండల కేంద్రంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అధికారులు నిర్లక్ష్యంతో మరమ్మతులు చేపట్టకపోవటం స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

పిడుగు పాటుకు గేదె మృతి.. రైతు ఆవేదన..

జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి అక్కడ అక్కడ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. అనంతపురం శివారు ప్రాంతం రాజీవ్ కాలనీ లో పిడుగుపాటు శబ్దానికి గేదె మృతి చెందింది. రాత్రి సమయంలో చెట్టుపై పిడుగు పడింది. ఆ శబ్దానికి గేదె మృతి చెంది ఉంటుందని వారు తెలిపారు. 15 రోజుల క్రితమే రూ.80 వేలు వెచ్చించి కొనుగోలు చేసినట్లు వెంకటరమణ తెలిపాడు.

ఇవీ చూడండి...

అనంతలో ఘనంగా రేణుక ఎల్లమ్మ జాతర

ABOUT THE AUTHOR

...view details