ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనంతపురంలో ముంచెత్తిన వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం

By

Published : Nov 2, 2022, 8:15 PM IST

Heavy rain in Anantapur: ఇటీవల వరదల కారణంగా ఇబ్బంది పడిన అనంతపురం నగర ప్రజలు.. మళ్లీ వర్షం రాకతో భయాందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Heavy rain in Anantapur
అనంతపురంలో ముంచెత్తిన వాన

Heavy rain in Anantapur: అనంతపురం నగరంలో భారీ వర్షం కురుసింది. రెండు రోజులుగా చిన్నపాటి చినుకులతో తడి చేసిన నేలపై ఈరోజు మధ్యాహ్నం నుంచి దాదాపు గంట పాటు భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షం పడిన ప్రతిసారి కొన్ని కాలనీలో నీరు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల వరదల కారణంగా ఇబ్బంది పడిన నగర ప్రజలు.. వర్షం రాకతో భయాందోళన చెందుతున్నారు. వరద నీరు సక్రమంగా పారేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details