ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉత్తరాంధ్ర, రాయలసీమలో భారీ వర్ష సూచన

By

Published : Sep 26, 2019, 9:38 AM IST

నేడున ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఆర్టీజీఎస్​ తెలిపింది. చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఉత్తరాంధ్ర, రాయలసీమలో భారీ వర్ష సూచన

ఇవాళ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఆర్టీజీఎస్‌ వెల్లడించింది. చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్ష సూచన ఉందని తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్ష కురిసే అవకాశం ఉంది.

రేపు ఉత్తరాంధ్ర , ఉభయగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్ష సూచన ఉంది. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశముంది. ఎల్లుండి ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్ష సూచన ఉన్నట్లు ఆర్టీజీఎస్​ తెలిపింది. ఎల్లుండి అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్ష సూచన ఉంది. కృష్ణా, గుంటూరు ప్రకాశం, నెల్లూరు, కడప కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది.

Intro:తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో భారీగా నష్టపోయిన ఆగాకర రైతులు


Body:ఆగాకరకాయల రేటు ఆకాశాన్ని తాకిన...కాపు సరిగా లేక రైతులను నిలువునా ముంచేశాయి.తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో ఆగాకర సాగు చేశారు. కాసులు కురిపిస్తుందనుకున్న పంట రైతులకు కష్టాన్ని మిగిల్చింది. కొన్ని వందల ఎకరాల్లో సాగు చేస్తే వర్షాల కారణంగా విపరీతమైన పంట నష్టం వాటిల్లింది.
vo1: తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలోని ప్రత్తిపాడు, రౌతులపూడి, ఏలేశ్వరం,జగ్గంపేట, గొల్లప్రోలు, శంఖవరం,గోకవరం మండలాల్లో ఆగాకర పంటను విస్తృతంగా సాగు చేశారు. ఎకరానికి దాదాపు లక్ష రూపాయల పెట్టుబడి పెట్టామని రైతులు చెబుతున్నారు. కానీ కాయలకు వైరస్ పట్టడం, దుంపకుళ్లు రావటం వలన దిగుబడి రావట్లేదని అంటున్నారు. కొన్ని కాయలకు మచ్చ ఏర్పడుతుందని వాటిని ఎవరు కొనరని చెబుతున్నారు. వీటికి సరైన సమయంలో వర్షాలు పడకుండా సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో పడటం కారణమని అన్నారు. దీంతో నేల తడిగా ఉండటం వల్ల చెట్లు తెల్లగా మారి కాయలు ముడతలు వస్తుందని చెప్పారు. ఈ తెగుళ్లని తగ్గించటానికి అనేక రకాల మందులు వాడుతున్నామని అన్నారు.తమ కష్టం మొత్తం వృథాగా పోయిందని వాపోతున్నారు. ఇవన్ని ఒకేత్తు అయితే కోతులు, చిలకల నుంచి మిగిలిన పంటను కాపాడుకోవటం గగనంగా మారిందని అంటున్నారు. ఒక్క పొలంలో నలుగురు కాపలా ఉండాల్సి వస్తుందని చెప్పారు.వాటి బెడద ఎక్కువగా ఉందని అన్నారు.
vo2: ప్రస్తుతం ఆగరకాయలకు 10 కిలోలకి 600 రూపాయల ధర పలుకుతోందని.. కాపు ఎక్కువగా లేకపోవటం వల్ల ఇలా రేటు పెరిగిందని అన్నారు.ఇది కూడా రోజురోజూకి తగ్గిస్తున్నారని తెలిపారు. ఈ పంటలో కొంత భాగం పోతుపాధులు వస్తుందని చెప్పారు.ఇది చెట్టు మొత్తం ఎదిగాక తెలుస్తుందని...వాటితో ఏ ఉపయోగం లేదని చెబుతున్నారు. దీని వల్ల కాయలు కాయవని వాటిని తీసివేయాలని తెలిపారు. పంట అంతా ఇలా తీసేసుకుంటూ పోతె తమకి ఇక ఏం మిగులుతుందని అంటున్నారు. వ్యవసాయ అధికారులు ఎవరు ఇంత వరకు రాలేదని చెప్పారు.
evo: దిగుబడి,గిట్టుబాటు ధర లేక రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని ..ఇలానే కొనసాగితే రైతులు ఎవరు వ్యవసాయం చేయలేరని అన్నారు.
శ్రీనివాస్,ప్రత్తిపాడు,617,ap10022
ప్రవీణ్,ejs student


Conclusion:

ABOUT THE AUTHOR

...view details