ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అక్రమ మద్యం, గుట్కా పాకెట్లు పట్టివేత

By

Published : Jan 18, 2021, 6:50 AM IST

అనంతపురం జిల్లాలో అక్రమంగా గుట్కాను తరలిస్తున్న వ్యక్తిని రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 44 వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. విడపనకల్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో.. మద్యం అక్రమ రవాణాను గుర్తించారు.

అనంతపురం జిల్లాలో గుట్కా పాకెట్ల పట్టివేత
అనంతపురం జిల్లాలో గుట్కా పాకెట్ల పట్టివేత

అనంతపురంలో అక్రమంగా గుట్కాను తరలిస్తున్న రాఘవేంద్ర అనే వ్యక్తిని రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో అనుమానస్పదంగా సంచరిస్తున్న రాఘవేంద్ర అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. తమను గమనించి తప్పుకోవాలని చూసిన అతన్ని... వెంబడించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్దనున్న నలభై నాలుగు వేలకు పైగా విలువచేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ జాకీర్ హుస్సేన్ చెప్పారు.

వాహనాల తనిఖీ... మద్యం పట్టివేత

మద్యం పట్టివేత

జిల్లాలోని విడపనకల్, పాల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వేరువేరు ప్రాంతాల్లో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. విడపనకల్ మండలం డోనేకల్ చెక్ పోస్ట్ వద్ద సెబ్ అధికారులు, పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా యాడికి ప్రాంతానికి చెందిన వ్యక్తి నుంచి 85 టెట్రా మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అతను ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం సీజ్ చేసి ఆ వ్యక్తిని పై కేసు నమోదు చేశారు. అదే విధంగా.. ఉండబండ ప్రాంతంలో ఓ వ్యక్తి వద్ద సుమారు 623 టెట్రా మద్యం ప్యాకెట్లను గుర్తించారు. అతను మద్యం ప్యాకెట్లను అక్కడే పారేసి పారిపోయాడు.

నాటుసారా కేంద్రాలపై దాడులు

బెల్లం ఊటను ధ్వంసం చేస్తున్న పోలీసులు

గుడిబండ మండలంలోని ఎస్​ రాయపురం అటవీ ప్రాంతంలో రెండు వేర్వేరు చోట్ల నాటుసారా తయారీ కేంద్రాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 100 లీటర్ల నాటు సారా ఊట పట్టుబడింది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

దర్గాకు నిప్పు పెట్టడం కిరాతక చర్య: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details