ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రూ. 6 కోట్లు విలువ చేసే వక్కల లోడు లారీలు సీజ్.. ఎందుకంటే?

By

Published : Apr 13, 2022, 5:37 PM IST

Seized: తమిళనాడు నుంచి దిల్లీ వెళ్తున్న ఆరు వక్కల లోడు లారీలను జీఎస్టీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.6 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

GST officers seized betel nut load lorries
ఆరు కోట్లు విలువ చేసే వక్కల లోడు లారీలు సీజ్

Seized: అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో వక్కల లోడుతో వెళ్తున్న లారీలను జీఎస్టీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు నుంచి దిల్లీ వెళ్తున్న ఆరు లారీలను పరిశీలించగా రవాణాకు సంబంధించిన బిల్లులు సక్రమంగా లేవని అధికారులు చెప్పారు. ఇన్వాయిస్ బిల్లు మాత్రమే ఉందని, సరుకుకు సంబంధించిన బిల్లులు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో వక్క లారీ విలువ రూ.కోటి వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రవాణాకు కావాల్సిన అన్ని అనుమతులు ఉంటే పరిశీలించి పంపుతామని.. లేనిపక్షంలో కేసు నమోదు చేయాల్సి వస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details