ఆంధ్రప్రదేశ్

andhra pradesh

India world record: 75 దేశభక్తి గీతాలకు నృత్యం... భారత్ వరల్డ్ రికార్డు

By

Published : Aug 8, 2022, 2:03 PM IST

Updated : Aug 8, 2022, 3:49 PM IST

India world record
భారత్ వరల్డ్ రికార్డు

అనంతపురం జిల్లాకు చెందిన నృత్య శిక్షకుడు విజయ్ కుమార్ భారత్ వరల్డ్ రికార్డు సృష్టించారు. 'మేరా భారత్ కళాకార్' అనే నినాదంతో... 75 దేశభక్తి గీతాలకు 4 గంటల 10 నిమిషాలు నృత్యం చేసి భారత్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. ఆయన ప్రతి సంవత్సరం ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు.

అనంతపురం నగరానికి చెందిన కత్తి విజయ్ కుమార్ నృత్య శిక్షకుడిగా మంచి పేరున్న వ్యక్తి. ఎంతోమంది శిక్షకులను తయారుచేసిన ఘనత ఇతనిది. ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి ఏదో ఒక రకమైన వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించి దేశభక్తిని చాటుకుంటాడు. గతంలోనూ 75 మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలను గీసి ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డులు స్థానం సంపాదించాడు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆజాదికా అమృత మహోత్సవ' కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ 75 దేశభక్తి గీతాలకు నృత్యం చేసి అందర్నీ ఆకర్షించాడు. భారత్ వరల్డ్ రికార్డు నేషనల్ కోఆర్డినేటర్ నరేంద్ర గౌడ్ రికార్డింగ్ జ్ఞాపికను అందించారు. భారత్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించిన ఈయనకు తోటి నృత్య శిక్షణ కారులు, కళాకారులు అభినందనలు తెలిపారు.

భారత్ వరల్డ్ రికార్డు

ఇవీ చదవండి:

Last Updated :Aug 8, 2022, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details