ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనాతో జీవిత బీమా సంస్థ కార్యాలయం మూసివేత

By

Published : Jun 8, 2020, 6:44 PM IST

జీవిత బీమా సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఒక ఉద్యోగికి కరోనా రావటంతో అధికారులు కార్యాలయాన్ని మూసివేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న 31 మంది ఉద్యోగులు సిబ్బందిని అధికారులు రాయదుర్గం క్వారంటైన్ కి తరలించారు.

ananthapuram district
కరోనాతో జీవిత బీమా సంస్థ కార్యాలయం మూసివేత

అనంతపురం జిల్లా రాయదుర్గంలోని జీవిత బీమా సంస్థ కార్యాలయాన్ని సోమవారం మూసివేశారు. ఎల్ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్న కర్నూలు నగరానికి చెందిన అసిస్టెంట్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావటంతో క్వారంటైన్ కి తరలించారు. మే 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాయదుర్గం ఎల్ఐసీ కార్యాలయంలో తోటి ఉద్యోగులతో కలిసి విధులు నిర్వహించాడు. ఆయనకు జ్వరం రావటంతో స్వంత ఊరు కర్నూలుకు వెళ్ళాడు. అక్కడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సలు చేయించుకున్నాడు. వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు కూడా చేశారు. జూన్ 7వ తేదీన ఆయనకు వైద్యపరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆయనను అధికారులు కర్నూల్ లో ఐసోలేషన్ కు తరలించారు.

రాయదుర్గం పట్టణంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఒక్కసారిగా ఎల్ఐసీ కార్యాలయం ఉద్యోగి కరోనా సోకిందని ప్రచారం కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎల్ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్న 31 మంది ఉద్యోగులు సిబ్బందిని అధికారులు రాయదుర్గం క్వారంటైన్ కి తరలించారు. తోటి ఉద్యోగులకు సోమవారం కరోనా పరీక్షలు చేయనున్నట్లు రాయదుర్గం తహసిల్దార్ సుబ్రమణ్యం తెలిపారు.

ఇది చదవండిరాష్ట్రంలో కొత్తగా 154 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details