ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనంతలో అకాల వర్షాలు.. అరటి రైతుకు అపార నష్టం

By

Published : Apr 22, 2021, 7:11 PM IST

అనంతపురం జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు రెండు లక్షల మేర నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేతికొచ్చిన పంటలు గాలివానల కాణంగా తీవ్ర నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

farmers lossed crope
farmers lossed crope

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. సుమారు గంట పాటు భారీ వర్షం కురిసింది. టవర్ క్లాక్ ప్రాంతం వర్షపు నీటితో నిండిపోయింది. ఉరవకొండ మండలం మోపిడి గ్రామంలో ఈదురుగాలుల దాటికి దాదాపు 3 ఎకరాల్లో అరటి పంట నెలకొరిగింది. 2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు. చేతికొచ్చిన పంట ఇలా అకాల వర్షం కారణంగా నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఉద్యానశాఖ అధికారులు స్పందించి పరిహారం అందించాలని కోరారు. వేరుశెనగ, ఇతర పంటలు సైతం దెబ్బతిన్నాయని వారు కలత చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details