ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మద్యం అక్రమ రవాణాపై ఆంధ్ర, కర్ణాటక పోలీసుల సంయుక్త దాడి

By

Published : Feb 17, 2021, 7:06 AM IST

మద్యం అక్రమ రవాణా, నిల్వలపై ఆంధ్ర, కర్ణాటక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో పెద్ద దాల్వాటం గ్రామంలో ఇద్దరు వ్యక్తుల వద్ద 832 కర్ణాటక మద్యం ప్యాకెట్లు, 24 బీర్ బాటిళ్లతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

police raids on illicit liquor in Anantapur district
అక్రమ మద్యంపై ఆంధ్ర, కర్ణాటక పోలీసుల సంయుక్త దాడి

అక్రమ మద్యం నిల్వలపై, రవాణాపై ఆంధ్ర - కర్ణాటక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో నాలుగవ దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మద్యం కట్టడి చేసేందుకు స్థానిక స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో పోలీసులు కర్ణాటకలోని పావగడ, మధుగిరి ప్రాంతాల ఎక్సైజ్ శాఖ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. మడకశిర నియోజకవర్గానికి అక్రమ మద్యం తరలించేందుకు అవకాశమున్న కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో రెండు బృందాలుగా విడిపోయి ఈ దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో పెద్ద దాల్వాటం గ్రామంలో ఇద్దరు వ్యక్తుల వద్ద 832 కర్ణాటక మద్యం ప్యాకెట్లు, 24 బీర్ బాటిళ్లతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పోలింగ్ జరిగే 48 గంటల ముందు అయిదు కిలోమీటర్ల దూరంలోని సరిహద్దున ఉన్న కర్ణాటకలోని మద్యం దుకాణాలను మూసివేస్తామని కర్ణాటక ఎక్సైజ్ పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:గుంతకల్లులోని 23 పంచాయతీల్లో ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి

ABOUT THE AUTHOR

...view details