ఆంధ్రప్రదేశ్

andhra pradesh

farmers worried మంచి ధర వచ్చిన వేళ, పంటంతా నీటిపాలు.. అప్పు తీరే దారేది..! ఉసూరుమంటున్న రైతన్న

By

Published : May 13, 2023, 3:20 PM IST

Updated : May 13, 2023, 7:40 PM IST

Singanamala farmers

AP government should support the Singanamala farmers: అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని.. దిగుబడి నీటిపాలై.. అప్పే మిగిలిందని.. అనంతపురం జిల్లా సింగనమల రైతులు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం లేని సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వరి పంటకు మంచి ధర లభిస్తుందని వాపోతున్నారు. గత ఏడాది ఎకరాకు 40 బస్తాలు పండిస్తే, ఈసారి నాలుగు బస్తాలు కూడా పండించలేకపోయామని కన్నీరుమున్నీరవుతున్నారు.

AP government should support the Singanamala farmers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే కురిసిన అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంటలు నీటిపాలవడంతో రైతులు విలవిలాడిన విషయం తెలిసిందే. పంట కోసం అన్నదాతలు అప్పులు చేసి, ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే.. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు కురిసి రైతులకు కడగండ్లు మిగిల్చాయి. దీంతో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల్లో రైతులు ఆరబెట్టిన వడ్లు తడిసిముద్దయ్యాయి. మరోవైపు అకాల వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు విరిగి, కరెంట్ తీగలు తెగి పడి విద్యుత్ సరఫరా నిలిపోయింది. మరికొన్ని చోట్ల చెట్లు రోడ్లపై విరిగి పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్రం అంతరాయం ఏర్పడి.. ప్రజల నానా అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో అకాల వర్షానికి దెబ్బతిన్న అనంతపురం జిల్లా సింగనమల మండలం సింగనమల ఆయుకట్టు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గతేడాది 40-ఈ ఏడాది 4..రాష్ట్రవ్యాప్తంగా గతకొన్ని రోజులక్రితం కురిసిన అకాల వర్షానికి అనంతపురం జిల్లా సింగనమల మండలంలోని సింగనమల ఆయుకట్టు కింద పండించిన వరి పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో పంట దిగుబడిపోయింది దారుణంగా పడిపోయింది. గత ఏడాది ఎకరాకు దాదాపు 40 బస్తాలు పండిస్తే ఈసారి నాలుగు బస్తాలు కూడా పండించలేకపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం సాగుచేసిన పంటకు ఎకరాకు ఐదు నుంచి పది బస్తాలు మాత్రమే దిగుబడి వస్తుందని, ఈ దిగిబడితో పంట కోసం తెచ్చిన అప్పులను కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నామని వాపోతున్నారు.

ఆయకట్టు రైతులను అధికారులు ఆదుకోవాలి..పలువురు రైతులు మాట్లాడుతూ.. ''ఆయకట్టు కింద రబీలో వెయ్యి ఎకరాల పంట వేశాం. ఎకరాకు 30 వేలు ఖర్చు చేశాం. కౌలు రైతులు కౌలులతోపాటు పంట సాగుకు వడ్డీ వ్యాపారుల వద్ద వడ్డీ తెచ్చుకొని పంట వేశారు. వచ్చిన ధాన్యం వరి కోత యంత్రానికి సరిపోతుంది. ఈ ఏడాది అకాల వర్షాల వల్ల ప్రతి రైతు అప్పలపాలయ్యాడు. పంట దిగుబడి ఎక్కువగా వచ్చినప్పటికీ అకాల వర్షంతో లక్షల్లో నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి ఆయకట్టు కింద వరి పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.'' అని వారు డిమాండ్ చేశారు.

ఒక్క వరి బస్తాకు రూ.1300.. మరోవైపు ఈ ఏడాది ధాన్యానికి మంచి ధర పలుకుతోందని రైతులు తెలిపారు. వ్యాపారులు బస్తా రూ. 1300వరకూ కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వరికి మంచి ధర లభిస్తున్నప్పటికీ అకాల వర్షం బాగా పంట నష్టం జరిగిందని, ఈ సమయంలో ధాన్యం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ఎకరాకు కనీసం.. 40 బస్తాలు వచ్చినా రూ. 52 వేలు వస్తుందని.. ఈ లెక్కన రైతుకు 23 వేలు అప్పు మిగులుతోందన్నారు. ఐదు ఎకరాల్లో పంట వేసిన రైతులు.. దాదాపు లక్షకు పైగా నష్టం తప్పడం లేదని.. వడ్డీలు చెల్లించలేని పరిస్థితికి అకాల వర్షాలు అన్నదాతకు కన్నిటీని మిగిల్చిందని ఆవేదన చెందారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

''వడగండ్ల వర్షానికి పూర్తిగా వరి పంట దెబ్బతింది. రెండు ఎకరాల్లో వరి పంట సాగు చేయడం వల్ల ఒక్కో ఎకరాకు 20వేల నుంచి 30 వేల వరకు పెట్టుబడి వచ్చింది. 15 మూటల కన్నా ఎకరాకు కావడం లేదు. రెండు ఎకరాలకు గాను 30 బస్తాల కన్నా ఎక్కువ పంట పండలేదు. ఈసారి ఒక ఎకరాకి రూ.15,000 నుంచి రూ. 20 వేల వరకు నష్టం జరిగింది. మమ్మల్ని గవర్నమెంట్ ఏదైనా సబ్సిడీ ద్వారా ఆదుకోవాలని కోరుతున్నాము.''-సింగనమల రైతులు.

పంటంతా నీటిపాలు.. అప్పు తీరే దారేది..! ఉసూరుమంటున్న రైతన్న

ఇవీ చదవండి

Last Updated :May 13, 2023, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details