ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లను పూర్తి చేస్తాం"

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 13, 2024, 2:08 PM IST

Anantapur JC Checked Election Arrangements: రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధమౌవుతోంది. రాజకీయ పార్టీలు, అధికారులు, ఎన్నికల అధికారుల ఇలా అందరూ ఎన్నికలకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఎన్నికలు ఏ క్షణంలో వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

anantapur_jc_checked_election_arrangements
anantapur_jc_checked_election_arrangements

Anantapur JC Checked Election Arrangements: రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారులు సమయత్తమవుతున్నారు. ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలనే లక్ష్యంగా అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్​ కేంద్రాల దూరం, ఒక్కో కేంద్రానికి ఎంత మంది ఓటర్లున్నారు వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా జేసీ జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించి, పోలీంగ్​ కేంద్రాల్లోని మౌలిక వసతుల ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతపురం జిల్లా జేసీ కేతన్​ గార్గ్​ విడపనకల్లు, ఉరవకొండ మండలాల్లో ఏర్పాటు చేసిన పోలీంగ్​ కేంద్రాలను తనిఖీ చేశారు. ఆయన వెంట తహశీల్దార్లు, సెక్టార్​ అధికారులు ఉన్నారు. ఒక్కో పోలీంగ్​ కేంద్రంలో ఎంతమంది ఓటర్లున్నారు, ఓటర్లందరికి సరిపడ మౌలిక వసతులు ఉన్నాయా వంటి అంశాలను పరిశీలించారు. ఓటర్లు ఇబ్బందులను ఎదుర్కోకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఆందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

"శాంతియుత వాతావరణంలో ఎలక్షన్లు జరగాలి - వారు ఎన్నికల పక్రియకు హాని"

అల్లర్లు జరిగే అవకాశం ఉందా అనే అంశంపై ఆరా : ఎన్నికల పరికాలు, యంత్ర సామాగ్రిని ఉరవకొండ నియోజకవర్గం నుంచి పోలింగ్​ కేంద్రాలకు తరలించడానికి గల దూరాన్ని ఎంతో తెలుసుకున్నారు. గతంలో ఏదైనా పోలీంగ్​ స్టేషన్లలో అల్లర్లు జరిగాయా అనే అంశంపై వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఏదైనా ప్రాంతంలో అల్లర్లు చెలరేగే పరిస్థితి ఉందా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగుంచుకునేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు వివరించారు. విషయాలను పరిశీలించిన తర్వాత సంతృప్తి వ్యక్తం చేశారు.

ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే ఏం చేయాలి ?

మార్పులు చేర్పుల పరిష్కారానికి చర్యలు : నాడు నేడు పనుల కారణంగా ఏదైనా ప్రాంతంలో ఇబ్బందులు ఉంటే వాటిపై ఇంజనీరింగ్​ అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు గడువు ముగియడంతో వాటి పరిష్కారంపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

వసతుల కల్పనలో సర్వేయర్లు భాగస్వాములే: సర్వేయర్లు పోలింగ్​ కేంద్రాల గుర్తింపు, పోలింగ్​ కేంద్రాల్లోని వసతుల అంశాల పరిశీలనలో సర్వేయర్లు భాగస్వాములేనని స్పష్టం చేశారు. వసతుల కల్పన అంశాలను తహశీల్దార్​ మీద వదిలేయకుండా సర్వేయర్లు కూడా భాద్యత వహించాలని ఉరవకొండ సర్వేయర్లకు సూచించారు.

సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతపై ఏపీ అధికారులతో సీఈసీ భేటీ

ABOUT THE AUTHOR

...view details