ఆంధ్రప్రదేశ్

andhra pradesh

FRAUD: చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరుతో రూ.20 కోట్లు బురిడీ

By

Published : Jan 23, 2022, 10:43 AM IST

Updated : Jan 23, 2022, 11:46 AM IST

వడ్డీ వ్యాపారం పేరుతో రూ.20 కోట్లు బురిడీ
వడ్డీ వ్యాపారం పేరుతో రూ.20 కోట్లు బురిడీ

10:40 January 23

భారీగా డబ్బులు వసూలు చేసి పరారయ్యేందుకు మహిళ యత్నం

వడ్డీ వ్యాపారం పేరుతో రూ.20 కోట్లు బురిడీ

FRAUD: చిట్టిల పేరుతో అనంతపురంలో ఓ మహిళ వందమందికి శఠగోపం పెట్టింది. దాదాపు 20 కోట్ల రూపాయల వరకూ వసూలు చేసి మోసం చేసింది. అనంతపురంలోని విద్యుత్ నగర్ కు చెందిన జయలక్ష్మి బ్యూటీ పార్లర్ నడుపుతోంది. స్థానికంగా చిట్టీలు నిర్వహిస్తోంది. అనేక మంది ఆమెను నమ్మి చిట్టీలు కట్టారు. ఐతే చిట్టీలు కట్టిన వారికి డబ్బులు ఇవ్వకుండా కొన్నాళ్లుగా తప్పించుకుని తిరుగుతోంది. ఇదే క్రమంలో ఇంటిని ఖాళీ చేసి వెళ్తుండగా బాధితులు వెంబడించి పట్టుకున్నారు.

పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే....స్థానిక ఎస్‌ఐ.. జయలక్ష్మికి వత్తాసు పలుకుతూ ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని.. బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయమని అడిగితే.. ఎవర్నడిగి చిట్టీలు వేశారంటూ మండిపడుతున్నారని చెబుతున్నారు. ఎస్ఐ రాఘవరెడ్డి తీరుకు నిరసనగా స్టేషన్ ఎదుట బైఠాయించి మహిళలు ఆందోళన నిర్వహించారు.

ఇదీ చదవండి:కరోనాతో చిత్రసీమ ఆగమాగం.. రూ.1500కోట్లు నష్టం!

Last Updated : Jan 23, 2022, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details