ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీడ్స్‌ కంపెనీలో విషవాయువు లీకేజీ ఘటన.. విచారణకు కమిటీ నియమించిన ఎన్జీటీ

By

Published : Aug 3, 2022, 10:07 PM IST

Updated : Aug 3, 2022, 10:43 PM IST

National Green Tribunal

22:05 August 03

2 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశం

NGT appointed Committee: సీడ్స్‌ కంపెనీలో విషవాయువు లీకేజీపై విచారణకు.. ఆరుగురు సభ్యులతో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ కమిటీ నియమించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ డైరెక్టర్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. నోడల్‌ ఎజన్సీగా కాలుష్య నియంత్రణ మండలి ఉంటుందని తెలిపింది. 2 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని.. చర్యలపై తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విషవాయువు వార్తను సుమోటోగా స్వీకరించిన ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్‌.. తదుపరి విచారణను డిసెంబర్‌ 16కు వాయిదా వేసింది.

Achyutapuram gas leak incident: అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్‌ కంపెనీలో గ్యాస్‌ లీక్‌ ఘటనలో బాధితులకు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో 53 మంది మహిళలు చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది జూన్‌ 3న ఇదే కంపెనీలో విషవాయువు లీకై 469 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం అదే తరహాలో గాఢమైన విషవాయువు లీక్ కావడంతో.. బీ-షిఫ్టులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వాంతులు, తల తిరగడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. భోజన విరామ సమయంలో వాయువు వెలువడిందని.. కొన్ని నిమిషాల్లోనే వ్యాపించి ఏం జరిగిందో తెలుసుకునే లోపే కుప్పకూలిపోయినట్టు బాధితులు చెబుతున్నారు.

ఇవీ చూడండి

Last Updated :Aug 3, 2022, 10:43 PM IST

ABOUT THE AUTHOR

...view details