ఆంధ్రప్రదేశ్

andhra pradesh

King Cobra: 12 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. హడలిపోయిన జనం

By

Published : Sep 15, 2022, 6:11 PM IST

Large King Cobra

King Cobra: అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో 12 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. జనాలను కంగారు పెట్టించింది. ఈ భారీ పామును బందించేందుకు చాలా ఆవస్థలు పడాల్సి వచ్చింది. చివరకు వన్యప్రాణి సంరక్షణ సభ్యులు.. కోబ్రా పామును పట్టుకుని సురక్షితంగా అటవీలో వదిలిపెట్టడంతో.. అందరు ఊపిరి పీల్చుకున్నారు.

Large Size Of King Cobra: 12 అడుగుల భారీ కింగ్​ కోబ్రాను చూసిన అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కాశీపురం శివారు లక్ష్మిపేటలో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. భారీగా ఉన్న ఈ తాచుపామును చూసిన జనం భయపడిపోయారు. ఓ మరుగుదొడ్డిలో కింగ్​ కోబ్రా కనిపించడంతో..గ్రామంలో ఒక్కసారిగా కలవరం చోటు చేసుకుంది. బుసలు కొడుతు కదులుతున్న ఈ పామును చూసి, ప్రజలు హడలిపోయి.. వన్యప్రాణి సంరక్షణ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న ఈస్ట్రన్ గార్డ్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులు దాన్ని పట్టుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. చివరకు సురక్షితంగా సంచిలో బంధించి వంట్ల మామిడి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉపిరిపిల్చుకున్నారు.

తాచుపామును పట్టకుంటున్న వన్యప్రాణి సంరక్షణ సభ్యులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details