ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అర్హత ఉన్నా.. సంక్షేమ పథకాలు ఇవ్వరా.. విప్​ కరణం ధర్మశ్రీని నిలదీసిన మహిళలు

By

Published : Feb 8, 2023, 5:56 PM IST

Women who questioned Dharmashree: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ పర్యటించగా.. మహిళలు ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరుగుతుందని నిలదీశారు. స్థానిక వైసీపీ నాయకులు అర్హత ఉన్నా సంక్షేమ పథకాలు అందకుండా ఆపేస్తున్నారని ప్రశ్నించారు.

Women who questioned Dharmashree
Women who questioned Dharmashree

Women who questioned Dharma shree: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం కొత్తకోటలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీని మహిళలు సమస్యలపై నిలదీశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక అంబేడ్కర్, అరుంధతి కాలనీల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఒంటరి మహిళ పింఛను ఆపేసారని, జగనన్న గృహాల బిల్లు రావట్లేదని, అర్హత ఉన్న పథకాలు అందడం లేదని అడిగారు.

వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరుగుతుందని.. అర్హత ఉన్నా స్థానిక వైసీపీ నాయకులు సంక్షేమ పథకాలు అందకుండా ఆపేస్తున్నారని.. ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు. కాలనీలోని నీటి సరఫరా, రోడ్లు, కాలువలు సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అందడం లేదని ఎవరు బాధపడొద్దని, అర్హులందరికీ అందేలా చూస్తారని.. ధర్మశ్రీ అన్నారు. అంబేద్కర్ కాలనీలో సామాజిక భవనం నిర్మాణానికి రూ.10 లక్షలు, అరుంధతి కాలనీలో జగ్జీవన్​ రామ్ విగ్రహం వద్ద సామాజిక భవనానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

గడపగడపకు మన ప్రభుత్వంలో.. కరణం ధర్మశ్రీని నిలదీసిన మహిళలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details