ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆ పెద్దపులి చాలా తెలివైంది..: డీఎఫ్​వో అనంత శంకర్

By

Published : Jul 2, 2022, 7:54 PM IST

అనకాపల్లి జిల్లా యలమంచిలి అటవీ రేంజ్ పరిధిలో తిరుగుతున్న రాయల్ బెంగాల్ పెద్దపులిని గుర్తించేందుకు చర్యలు చేపట్టామని డీఎఫ్​వో అనంత శంకర్ అన్నారు. పాదముద్రల ఆధారంగా నాలుగేళ్ల వయసున్న రాయల్ బెంగాల్ పెద్దపులిగా గుర్తించామని.. ఇది చాలా తెలివైందన్నారు. జిల్లాలో పులి తిరిగిన ప్రాంతాన్ని డీఎఫ్​వో పరిశీలించారు.

పెద్దపులి సంచారంపై డీఎఫ్​వో ఆరా
పెద్దపులి సంచారంపై డీఎఫ్​వో ఆరా

DFO Anantha Shaker inspected the tiger wandering area: అనకాపల్లి జిల్లా యలమంచిలి అటవీ రేంజ్ పరిధిలో రాయల్ బెంగాల్ పెద్దపులి తిరుగుతున్న ప్రాంతాన్ని జిల్లా అటవీ శాఖ అధికారి(DFO) అనంత శంకర్ పరిశీలించారు. పెద్దపల్లి సమీపంలో పులి అడుగులను అటవీశాఖ అధికారులు ఇవాళ గుర్తించారు. జిల్లా అటవీ శాఖ అధికారి, ఇతర శాఖల అధికారులు.. ఈ ప్రాంతానికి కాలినడకన చేరుకున్నారు. దాని అడుగుజాడలు ఆధారంగా సుమారు పది కిలోమీటర్ల దూరం నడిచారు. ఆయా ప్రాంతాల్లో గుడిసెలు వేసుకున్న జీవిస్తున్న వారితో మాట్లాడారు. పులి సంచరిస్తోందని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి పాదముద్రల ద్వారా అది ఏ ప్రాంతంలో తిరుగుతోందో గుర్తించడంతో అధికారులు నిమగ్నమయ్యారు.

తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈ ప్రాంతానికి పెద్దపల్లి పులి వచ్చినట్లు గుర్తించారు. పాదముద్రలో ఆధారంగా నాలుగేళ్ల వయసున్న రాయల్ బెంగాల్ పెద్దపులిగా తేల్చారు. ఇది చాలా తెలివైందని... అయితే పులి సంచారంతో ఎలాంటి ప్రాణహాని జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దీన్ని బంధించేందుకు రూట్ మ్యాప్ వేసి ప్రత్యేక బృందాలను ఇక్కడ పెట్టిన ఆయన చెప్పారు. ఇది పగలంతా విశ్రాంతి తీసుకోని రాత్రి వేళలో ప్రయాణం చేస్తుందన్నారు.

పులి కదలికలపై అధికారులతో డీఎఫ్​వో సమీక్ష నిర్వహించారు. అనకాపల్లి జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతం సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలందరినీ అప్రమత్తం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అది ఏ దిశగా వెళ్తుందనేది అంచనా వేశారు. జీపీఎస్ సిస్టం ఏర్పాటు చేశామని డ్రోన్ కెమెరా సాయంతో పెద్దపులి ఆచూకీ తెలుసుకుంటామన్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. పెద్దపులి కారణంగా నష్టపోయిన వారికి పరిహారం చెల్లిస్తామని డీఎఫ్​వో అనంత శంకర్ తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details