ఆంధ్రప్రదేశ్

andhra pradesh

స్విఫ్ట్ కారుకు స్కార్పియో నెంబర్ ప్లేట్ .. గంజాయి నిందితుడు కార్లో డీఎస్పీ షికార్లు

By

Published : Feb 11, 2023, 10:59 PM IST

Anakapally DSP: చట్టాలు మన చేతిలో ఉన్నప్పుడు.. ప్రశ్నించేవారు ఎవరు అని అనుకున్నాడేమో ఆ పోలీసు అధికారి. చట్టవిరుద్దంగా చేసే పనులకు వాడిన కారులోనే.. షికారు చేశాడు. అంతే కాదు.. ఆ కారుకు స్మగ్లింగ్ చేస్తూ పట్టిబడిన మరో వాహన నెంబర్ ను తగిలించుకుని మరీ రోడ్లపై తిరుగాడు. ఇష్టరీతిని వ్యవహరిస్తూ.. రోడ్డుపైనే వెళ్ళే వాహానాన్ని ఢీ కొట్టాడు. సదరు భాదిత వాహనదారుడు ఆ వాహనాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అప్పుడే ఆ దొరగారి దొంగతనం బయపడింది.

Ganjai
Ganjai

Anakapally DSP: గంజాయి కేసులో పట్టుబడి అరెస్టు అయిన నిందితుడికి చెందిన కారులో అనకాపల్లి డీఎస్పీ సునీల్ షికార్లు చేయడం విమర్శలకు దారి తీసింది. నిందితుడికి చెందిన కారులో ప్రయాణించడమే కాక, కారు నెంబర్ బోర్డు మార్చడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు.

గత ఏడాది జూలై నెలలో కసింకోట మండలం ఏఎస్ పేట జాతీయ రహదారి వద్ద స్కార్పియో వాహనంలో గంజాయి తరలిస్తూ నిందితులు వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. పోలీసులు స్కార్పియో వాహనంలోని 220 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా రాజస్థాన్ కి చెందిన సింగ్ అనే వ్యక్తి జిమాడుగుల ప్రాంతంలో ఉంటూ గంజా వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సింగ్​ను గత ఏడాది నవంబర్​లో అరెస్ట్ చేశారు. ఈ సమయంలో ఇతను వచ్చిన షిఫ్ట్ వాహనాన్ని పోలీస్ స్టేషన్​లో ఉంచారు.

తప్పు మీద తప్పు:అప్పటినుంచి ఈ కారుని పోలీసులు వాడుకుంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తారీఖున అనకాపల్లి డీఎస్పీ సునీల్
గంజాయి నిందితుడికి చెందిన షిఫ్ట్ కారులో కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నం బీచ్ రోడ్డు కి వెళ్లారు. ఇక్కడ డీఎస్పీ డ్రైవ్ చేస్తూ ముందు ఉన్న వాహనాన్ని ఢీకొట్టారు. డ్రైవింగ్ నిర్లక్ష్యంగా చేయడంతో ముందు ఉన్న వాహన యజమాని డీఎస్పీ ప్రయాణిస్తున్న కారుని చరవాణిలో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది వైరల్​గా మారింది.

నెంబర్ ప్లేట్లు మార్చడం: సంఘటనపై విచారణ చేపట్టగా గంజాయి కేసులో నిందితుడి కారుగా గుర్తించారు. దీంతో పాటుగా కసింకోట మండలం ఏఎస్ పేట జాతీయ రహదారి గత ఏడాది జూలైలో గంజాయితో దొరికిన స్కార్పియో వాహనం నెంబర్ ప్లేట్ ని గంజాయి నిందితుడికి చెందిన షిఫ్ట్ వాహనానికి మార్చారు. గంజాయి రవాణాను అరికట్టాల్సిన పోలీసులు నిందితుడికి చెందిన కారులో తిరగడం నెంబర్ ప్లేట్లు మార్చడం పలు విమర్శలకు దారితీస్తుంది. సంఘటన తమ దృష్టికి వచ్చిందని విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపామని వారి ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమిశాలి తెలిపారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details