ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎన్నాళ్లీ డోలీ మోతలు.. గిరిజనుల కష్టాలు తీరేది ఎప్పుడు..

By

Published : Apr 27, 2022, 8:10 AM IST

DOLI
డోలీ మోతలు ఆగడం లేదు.. ఆస్పత్రికి తరలించే యాతన తప్పడం లేదు

Tribals problems in Agency: ప్రపంచమంతా ఎంతో ముందుకు దూసుకుపోతున్నా వారి బతుకులు మారడం లేదు.. ప్రభుత్వాలు మారినా వారి బతుకు చిత్రం అదే మాదిరిగా ఉంటోంది. భూమి మీదకు మరో ప్రాణాన్ని తీసుకురావాలంటే.. వాళ్లు తమ ప్రాణాలతో పోరాటం చేయాల్సిందే.. ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకువస్తున్నా... వారి కష్టాలు మాత్రం తీర్చడం లేదు. దీంతో అక్కడి గిరిజన గర్బిణీలు అమ్మతనం కోసం అవస్థలు పడుతూనే ఉన్నారు.

డోలీ మోతలు ఆగడం లేదు.. ఆస్పత్రికి తరలించే యాతన తప్పడం లేదు

DOLI: పాడేరు ఏజెన్సీలో డోలీ మోతలు ఆగడం లేదు. పురిటి నొప్పులు వస్తే ఆస్పత్రికి తరలించే యాతన తప్పడం లేదు. గిరిజన గర్భిణిల కోసం వసతి ఏర్పాటు చేసినా.. ముందస్తుగా తరలించే సౌకర్యం లేదు. ఫలితంగా.. పురిటి నొప్పులతో డోలీ మోతలు మోసి ఆస్పత్రికి తరలించాల్సి వస్తోంది. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం జన్నేరుగొండిలో ఇలాంటి పరిస్థితే పునరావృతమైంది. కొండమట్టి రహదారి వరకూ.. దాదాపు రెండు కిలోమీటర్ల వరకూ గర్భిణిని మోసుకొచ్చి ద్విచక్రవాహనంపై జి.మాడుగుల ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: టిడ్కో గృహాలపై గూడుకట్టిన నిర్లక్ష్యం.. సర్కార్​పై లబ్ధిదారుల విమర్శలు

ABOUT THE AUTHOR

...view details