ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అల్లూరి జిల్లాలో దారుణం.. తమ్ముడిని చంపిన అన్న

By

Published : Sep 1, 2022, 2:37 PM IST

Updated : Sep 1, 2022, 4:22 PM IST

elder brother killed her Brother
తమ్ముడిని చంపిన అన్న

14:32 September 01

రంగశీల శివారులో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు

Brother Murder: అల్లూరి జిల్లా హూకుంపేట మండలం రంగశీలలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భూవివాదాల కారణంగా సొంత తమ్ముడిని అన్న హత్య చేశాడు. విషయం బయటకు పొక్కకుండా మృతదేహాన్ని పాతిపెట్టాడు. రోజులు గడుస్తున్నా భర్త ఆచూకీ లభించకపోవడంతో అనుమానం వచ్చిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలో దిగిన పోలీసులు విచారణ చేపట్టగా... సోదరుడే తమ్ముడిని హత్య చేసినట్లు బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూవివాదం కారణంగా తమ్ముడు జయరాంను అన్న కృష్ణ హత్య చేశాడు. అనంతరం శవాన్ని ఎవరికీ దొరకకుండా పాతిపెట్టాడు. జయరాం భార్య.. కృష్ణపై అనుమానంతో ఫిర్యాదు చేసిందని పోలీసులు వెల్లడించారు. కృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. రంగశీల శివారులో పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి విచారణ జరుపుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 1, 2022, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details