ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు

By

Published : Dec 2, 2022, 10:32 PM IST

Updated : Dec 2, 2022, 11:00 PM IST

కవిత
కవిత ()

22:26 December 02

సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెరాస ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈనెల 6న ఉదయం 11గంటలకు విచారణ జరుపుతామని, హైదరాబాద్‌ లేదా దిల్లీలో ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలపాలని సీబీఐ నోటీసులో పేర్కొంది. సీబీఐ నుంచి తనకు నోటీసులు అందినట్టు ఎమ్మెల్సీ కవిత ధ్రువీకరించారు. ఈనెల 6న హైదరాబాద్‌లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని సీబీఐకి తెలిపినట్టు కవిత వెల్లడించారు.

దిల్లీ మద్యం కేసులో భాగస్వామ్యం/అనుమానం ఉన్న 36 మంది పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అమిత్‌ అరోడా రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఆయనను ఈడీ అరెస్టు చేసింది. కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా రిమాండ్‌ రిపోర్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన కల్వకుంట్ల కవిత, శరత్‌రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్‌, సృజన్‌రెడ్డి పేర్లు ఉన్న విషయం తెలిసిందే.

ఇవీ చదవండి:

Last Updated :Dec 2, 2022, 11:00 PM IST

ABOUT THE AUTHOR

...view details