ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఐ లవ్​ తెలంగాణ గవర్నమెంట్: విజయ్ దేవరకొండ

By

Published : Dec 25, 2021, 4:59 PM IST

Vijay Devarakonda on Cinema Tickets: తెలంగాణ గవర్నమెంట్​పై యువ హీరో విజయ్ దేవరకొండ ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో టికెట్ రేట్ల విషయంపై స్పందించిన ఆయన.. ఇండస్ట్రీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.

Vijay Devarakonda on Cinema Tickets
Vijay Devarakonda on Cinema Tickets

Vijay Devarakonda on Cinema Tickets: తెలంగాణలో.. సినీ పరిశ్రమను నూటికి నూటొక్క శాతం అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సినీ కథానాయకుడు విజయ్ దేవరకొండ అన్నారు. దేశంలోని అతి పెద్ద పరిశ్రమలలో.. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఒకటన్న విజయ్.. ఇండస్ట్రీ అభివృద్ధి కోసం సినిమా టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. తన ప్రభుత్వాన్ని ఎంతో ప్రేమిస్తున్నానని, సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడుతున్న తెలంగాణ సర్కార్​కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​తోపాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని విజయ్ కొనియాడారు. ఇందుకు నిదర్శనమే తెలంగాణలో సినిమా టికెట్ ధరల సవరింపు అని అన్నారు. టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ట్విట్టర్ ద్వారా విజయ్ అభిమానులతో పంచుకున్నారు.

అంతకముందు చిరంజీవి..
Chiranjeevi on Cinema Tickets Price: తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ధరలు సవరించిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. థియేటర్ల మనుగడకు, వేలాది మంది కార్మికులకు ఎంతో మేలు చేసే నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేశారని ట్విటర్ వేదికగా అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ కోరికను మన్నించి కేసీఆర్ సత్వరమే నిర్ణయం తీసుకోవడం పట్ల మెగాస్టార్ సంతోషం వ్యక్తం చేశారు. నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యాజమాన్యానికి న్యాయం జరిగేలా టికెట్ ధరలను సవరించడం ఆనందంగా ఉందన్నారు.

AP Cinema Tickets Issue : తెలంగాణలో అలా ఉంటే.. రాష్ట్రంలో టికెట్ ధరలపై వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఇక్కడి థియేటర్ యాజమాన్యాలు సినిమా హాల్స్​ను మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సినీ పెద్దలు జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి జగన్​తో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి:

theatre: రామ్ చరణ్ ప్రారంభించిన.. ఆసియాలోనే అతిపెద్ద సినిమా థియేటర్​ మూసివేత..!

ABOUT THE AUTHOR

...view details