ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గోదావరిలో దూకిన వివాహిత.. రక్షించిన జాలర్లు

By

Published : Oct 8, 2020, 6:31 PM IST

భర్త, అత్త వేధింపులు తాళలేక ఓ వివాహిత గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నం చేసిన సంఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసరలో చోటుచేసుకుంది. అక్కడే చేపలు పడుతున్న జాలర్లు గమనించి.. ఆమెను కాపాడారు.

గోదావరిలో దూకిన వివాహిత.. రక్షించిన జాలర్లు
గోదావరిలో దూకిన వివాహిత.. రక్షించిన జాలర్లు

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన మీనాకు.. ఫకీరాబాద్​కు చెందిన సురేందర్​తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఐదు, ఆరేళ్ల వయస్సుగల ఇద్దరు కుమారులున్నారు. పెళ్లైన నాటి నుంచి భర్త, అత్త తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీనా తెలిపారు. అనేక సార్లు తనను ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టారని ఆరోపించారు.

తల్లిదండ్రులు లేని మీనా.. తన పెద్దమ్మ వద్దే పెరిగింది. భర్త, అత్త వేధింపులు తట్టుకోలేక నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరిలో దూకింది. అక్కడే చేపలు పడుతున్న జాలర్లు ఆమెను గమనించి.. తెప్ప సాయంతో కాపాడారు. వివరాలు తెలుసుకుని నవీపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా విషయం తెలిపారు.

గోదావరిలో దూకిన వివాహిత.. రక్షించిన జాలర్లు

ABOUT THE AUTHOR

...view details