ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భార్య వదిలేసి వెళ్లిందని.. పిల్లల్ని చంపేశాడు!

By

Published : Apr 17, 2019, 5:05 PM IST

కుటుంబ కలహాలు ఆ పిల్లల ప్రాణాలు హరించాయి. ఆడుకునే వయసులో వారిని అనంతలోకాలకు చేర్చాయి. భార్య వదిలేసి వెళ్లిపోయిందనే కోపంలో.. పిల్లలిద్దర్ని హతమార్చాడు ఓ కసాయి తండ్రి.

father killed his two childern

పిల్లల్ని చంపేశాడు!

తెలంగాణలో ఓ కసాయి తండ్రి.. కన్న పిల్లలను కడతేర్చాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఈ దారుణం జరిగింది. బొంబాయి కాలనీలో నివాసముండే శిరీష, కుమార్.. దంపతులు. వారికి ముగ్గురు పిల్లలు. ఈ మధ్య భర్త తీరుతో విసిగిపోయిన శిరీష... కుటుంబాన్ని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. తనను వదిలేసిందన్న ఆగ్రహంతో... కుమార్ కసాయిగా మారాడు. కన్న పిల్లలని కూడా చూడకుండా.. వారిపై తన ప్రతాపం తీర్చుకున్నాడు. ప్రతిరోజు నాయనమ్మ, మేనత్తల వద్ద పడుకునే పిల్లల్ని తన ఇంట్లోకి తీసుకెళ్లాడు​. కుమారుడు అఖిల్​ను కత్తితో గొంతు కోసి హతమార్చాడు. చిన్న కుమార్తె శరణ్యకు వంట గదిలో ఉరి వేశాడు. పెద్ద కుమార్తె మల్లీశ్వరి గొంతు కోయడానికి ప్రయత్నించగా .. ఆమె తప్పించుకుని నాయనమ్మ వద్దకు చేరుకుంది.

ఈ ఘటనలో అఖిల్​, శరణ్య అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ పెద్ద కుమార్తె మల్లీశ్వరిని పటాన్​చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. పిల్లలను హత్య చేసిన కుమార్​ను స్థానికులు పట్టుకొని చితకబాదారు. రామచంద్రాపురం పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి: కరెంటు వాడకం పల్లెల్లో తగ్గింది నగరాల్లో పెరిగింది

Intro:hyd_tg_09_17_rcpur_two_children_murder_ab_C10
Lsnraju:9394450162
యాంకర్:


Body:కుటుంబ కలహాలే ఆ ఇద్దరు పిల్లలను హరించాయి కన్న తండ్రి కసాయిగా మారి చిన్నారి లిద్దరిని హతమార్చాడు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బొంబాయి కాలనీ లో కన్నతండ్రే తన పిల్లలను చంపే యత్నం చేసిన ఘటన కలకలం రేగింది ఈ ఘటనలో అఖిల్ శిరీష అనే ఇద్దరు పిల్లలు చనిపోగా మల్లేశ్వరి అనే పెద్ద బాలిక తీవ్రంగా గాయపడటంతో పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు ప్రతిరోజు నాయనమ్మ మేనత్తలు వద్ద పడుకునే పిల్లలను తండ్రి ఇంటి లోపలికి తీసుకెళ్లి అఖిల్ ను చాకుతో తో గొంతు కోసిన శిరీషను వంట గదిలో ఉరి వేశాడు పెద్దపాప మల్లేశ్వరి గొంతు కోసే యత్నించడంతో ఆమె పరిగెత్తికెళ్ళి నాయనమ్మ వద్దకు చేరుకుంది అయితే తన భార్య శిరీష ను గత కొంతకాలంగా వేధించి కొట్టడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది వెళ్లిపోయిందని అక్కసుతోనే ఈ పిల్లలను హతమార్చాడు రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు


Conclusion:బైట్ శోభ నాయనమ్మ
బైట్ స్వరూప మేనత్త

ABOUT THE AUTHOR

...view details