ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Superstitions: ఎదుగుదలను అడ్డుకుంటున్నాారని.. రాళ్లతో కొట్టి చంపాడు..

By

Published : Jul 20, 2022, 2:51 PM IST

Superstitions: దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నా.. ఇంకా కొంతమంది మూఢనమ్మకాలను వీడడం లేదు. గుప్త నిధుల కోసం, కొడుకు పుడతాడని, కోటీశ్వరుడు కావాలనే ఆశలతో కొంతమంది అక్కడక్కడ బలి ఇస్తున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా క్షుద్ర పూజలు చేస్తూ తన ఎదుగుదలను అడ్డుకుంటున్నారనే అనుమానంతో సొంత బాబాయి కుటుంబాన్నే రాళ్లతో కొట్టి చంపాడు ఓ యువకుడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.

Superstitions
Superstitions

Superstitions: మూఢనమ్మకం మూడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. క్షుద్ర పూజలు చేస్తూ తన ఎదుగుదలను అడ్డుకుంటున్నారనే అనుమానంతో సొంత బాబాయి కుటుంబాన్నే రాళ్లతో కొట్టి చంపాడు ఓ యువకుడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొత్తపల్లిలో ఈనెల 12న తిరుమలయ్య కుటుంబంపై అతని అన్న కుమారుడు మల్లికార్జున యాదవ్‌ రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో భార్య ఈశ్వరమ్మ సంఘటనాస్థలంలోనే మృతిచెందగా... ఈశ్వరయ్యతోపాటు కుమార్తె స్వప్న తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. 6 నెలల గర్భవతి అయిన స్వప్న 9 రోజులపాటు మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. నిందితుడు మల్లికార్జున కోసం పోలీసులు గాలిస్తున్నారు . ఓ స్వామీజి చెప్పిన మాటలు నమ్మి సొంత బాబాయి కుటుంబాన్ని మల్లికార్జున హతమార్చాడు.

బలితీసుకున్న మూఢనమ్మకం.. బాబాయి కుటుంబాన్ని హతమార్చిన యువకుడు

ABOUT THE AUTHOR

...view details