ఆంధ్రప్రదేశ్

andhra pradesh

DIED: బస్సు లేక ఆటోలో వెళ్లింది.. చివరకు ప్రాణాలు కోల్పోయింది.. ఎందుకంటే?

By

Published : May 3, 2022, 6:45 PM IST

DIED: వారు పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు.. వాళ్లు పరీక్షలు రాయడానికి వెళ్లే సమయంలో బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలో వెళ్తున్నారు. అలా వెళ్లడమే వారు చేసిన నేరం. పరీక్షలు రాసి గ్రామానికి తిరిగి వస్తున్న సమయంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆ ప్రమాదంలో గాయపడిన వారిలో చికిత్స పొందుతూ ఓ విద్యార్థి మృతి చెందింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

student died
ఆటో బోల్తా ఘటనలో విద్యార్థిని మృతి

DIED: అనంతపురం జిల్లాలో ఆటో బోల్తా పడిన ఘటనలో గాయపడి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అఖిల అనే విద్యార్థిని మృతి చెందింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరు విద్యార్థినిలు, ఆటో డ్రైవర్‌ అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ జరిగింది..

అనంతపురం జిల్లా విడపనకల్ వద్ద 10వ తరగతి విద్యార్థినిలు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. ఏపీ మోడల్ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాసి హవలిగి గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురు విద్యార్థినిలకు, ఆటో డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను విడపనకల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా.. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:నాసిరకం మద్యం కప్పిపుచ్చడానికి.. ప్రభుత్వం ప్రయత్నాలు: ప్రత్తిపాటి

ABOUT THE AUTHOR

...view details