ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పెనుగంచిప్రోలులో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

By

Published : Feb 27, 2021, 9:53 PM IST

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకోగా.. అదే సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తుతెలియని వ్యక్తులు అంబులెన్స్​కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఇది హత్యా.. లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

women death in penuganchiprolu
అనుమానాస్పద స్థితిలో యువతి ఆత్మహత్య

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పెనుగంచిప్రోలులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అదే సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇద్దరు యువకులు 108కు ఫోన్ చేశారు.

సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది అక్కడకి చేరుకోగా... అప్పటికే ఆ యువతి మృతిచెందింది. అనుమానాస్పంద స్థితిలో యువతి మృతిచెందడంపై ఆమె కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది హత్యా.. లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details