ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

By

Published : Feb 7, 2023, 10:57 AM IST

ROAD ACCIDENT IN JANGAON : తెలంగాణలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎంను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

ROAD ACCIDENT IN JANGAON
ROAD ACCIDENT IN JANGAON

ROAD ACCIDENT IN JANGAON : తెలంగాణలోని జనగామ జిల్లా పెంబర్తి జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామునే రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న డీసీఎంను కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. డీసీఎం డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు కారులో ఉన్న ఆరేళ్ల పాప మృతి చెందింది. కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డీసీఎం వాహనం పంక్చర్ కావడంతో టైరు మారుస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్ర మత్తులో ఉండటం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details