ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జల్సాలకు అలవాటు పడి.. 13బైక్​లు చోరీ.. ఎక్కడో తెలుసా?

By

Published : Jan 18, 2023, 4:18 PM IST

bike thief

కొంత కాలంగా అనంతపురం జిల్లాలో వరుసగా బైక్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 13 బైక్​లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చోరీ చేసిన బైక్​ల విలువ సుమారు రూ. 6 లక్షలు ఉంటుందని సీఐ వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు.

వరుస బైక్​ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

Police arrested the bike thief and recovered 13 bikes: కొంత కాలంగా నగరంలో వరుసగా బైక్ చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 13 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో చోటుచేసుకుంది. బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతని వద్ద నుంచి సుమారు రూ.6 లక్షల రూపాయల విలువచేసే 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా గుంతకల్లు నగరంలో ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నరేంద్ర రెడ్డి అనే వ్యక్తిని గుంతకల్లు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గుంతకల్లు సీఐ రామసుబ్బయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. కొంత కాలంగా నగరంలో బైక్​లు చోరీ కావడంతో పోలీసులు నిఘా పెట్టినట్లు సీఐ తెలిపారు. జిల్లాలోని పలు రద్దీ ప్రాంతాలలో బైకులను దొంగిలించి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించామన్నారు. అందులో భాగంగా గుంతకల్ పట్టణం హనుమేష్ నగర్​కు చెందిన నరేంద్రరెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వెల్లడించారు. అతని నుంచి సుమారు 6 లక్షల రూపాయల విలువచేసే 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ముద్దాయిని కోర్టుకు హాజరు పరచి రిమాండ్​కు తరలించామన్నారు.

'గుంతకల్లు పట్టణంలోని హనుమేష్​నగర్​లో​ మా పోలీసు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించాం. అదే సమయంలో ఎలాటి ఆధారాలు లేకుండా నరేంద్రరెడ్డి వద్ద 13 బైక్​లు ఉండటం గమనించాం. విచారణ చేయగా.. బైకను చోరీ చేస్తున్నట్లు తెలిపాడు. జల్సాలకు అలవాటుపడి, తాగుడుకు అలవాటై చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఆ బైక్​లను స్వాధీనం చేసుకున్నాం. ఈ రోజు కోర్టులో ప్రవేశపెడతాం. 13బైక్​ల మెుత్తం విలువ రూ. 6 లక్షల వరకు ఉంటుంది. నరేంద్రరెడ్డి పై గతంలో కేసులు ఉన్నాయి. పలు సందర్భాల్లో జైలు శిక్ష సైతం పడింది. వాహనాదారులు తమ వాహనాలను భద్రంగా ఉంచుకోవాలి'-. రామసుబ్బయ్య, సర్కిల్ ఇన్స్పెక్టర్ గుంతకల్లు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details