ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బెట్టింగ్​ ఆట గుట్టు రట్టు.. రూ.95 లక్షల ప్రాపర్టీ సీజ్

By

Published : Aug 5, 2021, 10:42 PM IST

తెలంగాణలోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తి నుంచి రూ.95 లక్షల విలువైన ప్రాపర్టీని సీజ్‌ చేశారు.

పోలీసు కమిషనర్ మహేశ్​ భగవత్‌
పోలీసు కమిషనర్ మహేశ్​ భగవత్‌

బెట్టింగ్​ ఆట కట్టిచ్చిన పోలీసులు..రూ.95లక్షల ప్రాపర్టీ సీజ్

హైదరాబాద్​ లో.. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ (Rachakonda Police Commissionerate) పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్ ముఠా (Online Cricket Betting Gang) గుట్టు రట్టయింది. ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్ ఆర్గనైజర్‌ షేక్‌ సాదిక్‌ను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారని పోలీసు కమిషనర్ మహేశ్​ భగవత్‌ తెలిపారు. నిందితుడి నుంచి రూ.95 లక్షల విలువైన ప్రాపర్టీని సీజ్‌ చేశామని... రూ.15 లక్షల 70వేల నగదు, 4 మొబైల్‌ ఫోన్లు, 28 క్రెడిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నామని సీపీ వివరించారు.

ఆర్గనైజర్‌ సాదిక్ కుటుంబ సభ్యులకు చెందిన 9 బ్యాంక్‌ అకౌంట్‌లను గుర్తించి వాటిల్లో ఉన్న రూ.69 లక్షల 3 వేల నగదును సీజ్‌ చేశామని చెప్పారు. నిందితుడు షేక్ సాదిక్ పలు యాప్​ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తాడని తెలిపారు. ఈ యాప్​లను సబ్ స్క్రైబ్ చేసుకుని బుకీల నుంచి ఐడీ, పాస్ వార్డ్ తీసుకుంటున్నాడని సీపీ పేర్కొన్నారు. ఆ తరువాత సోషల్ మీడియాలో ఆసక్తి ఉన్న వారితో బెట్టింగ్​లకు పాల్పడుతుంటారని సీపీ తెలిపారు.

క్రికెట్‌ మ్యాచ్ జరిగేటప్పుడు లింకులను పంపించి బెట్టింగులకు పాల్పడతాడని పేర్కొన్నారు. టాస్ విన్నింగ్ నుంచి మొదలు పెడితే మ్యాచ్ ముగిసే వరకు బాల్ టూ బాల్ బెట్టింగ్​లకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసి.. గెలిచిన వారి నుంచి ముప్పై శాతం కమిషన్ సైతం తీసుకుంటాడని సీపీ తెలిపారు.

ఇదీ చదవండి:

Viveka Murder Case: 'వివేకా హత్య కేసులో నా కుమారుడిని కావాలనే ఇరికించారు'

ABOUT THE AUTHOR

...view details