ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హెడ్‌ కానిస్టేబుల్‌ వేధింపులకు ఓ మైనార్టీ కుటుంబం ఆత్మహత్య

By

Published : Nov 16, 2022, 9:42 AM IST

Minority family Suicide in Anantapur: ఓ మైనార్టీ కుటుంబంలో కలహాలు కారణంగా.. ఓ మహిళ పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించింది. కానీ ఆ పోలీసులే.. సమస్యను ఆసరాగా చేసుకుని.. కుటుంబాన్ని వేధింపులకు గురి చేసి.. ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన ఘటన.. అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే అమాయకులను వేధించి, వారి మరణాలకు కారకులవుతున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు తీవ్రంగా మండిపడ్డారు.

Suicide in Anantapur
అనంతపురంలో ఆత్మహత్య

ఓ మైనార్టీ కుటుంబం ఆత్మహత్య

Minority family Suicide in Anantapur: అనంతపురం జిల్లా కణేకల్లు హెడ్‌ కానిస్టేబుల్‌ రఘునాథరెడ్డి తీవ్రంగా భయపెట్టడం వల్లే తమ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని.. బొమ్మనహల్‌ మండలం ఉంతకల్లు గ్రామానికి చెందిన ఓ మైనార్టీ కుటుంబం ఆరోపిస్తోంది. కుటుంబసభ్యుల మధ్య ఏర్పడ్డ మనస్పర్థలను ఆసరాగా చేసుకుని.. హెడ్‌ కానిస్టేబుల్ రఘునాథరెడ్డి.. విచక్షణారహితంగా కొట్టడంతో పాటు తీవ్రంగా వేధించారని వారు చెబుతున్నారు. బాధను తాళలేక పురుగుల మందు తాగి కుటుంబంలోని ఇద్దరు చనిపోయారని.. దీనికి పోలీసులే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాన్ని తెదేపా నేత కాలవ శ్రీనివాసులు పరామర్శించారు. ఘటనపై ఎస్పీ విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details