ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సెలవులకు వెళ్లొచ్చి.. హాస్టల్​లో స్పృహతప్పి పడిపోయి..

By

Published : Jun 6, 2022, 12:24 PM IST

DIED: వేసవి సెలవుల్లో ఇంటికి వెళ్లాడు... ఎంతో సంతోషంగా గడిపాడు... తిరిగి కాలేజికి తిరిగొచ్చాడు.. ఇంతలో ఏమైందో తెలియదు.. కళ్లు తిరిగి పడిపోయాడు.. చూసిన తోటి విద్యార్థులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అంతలోనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్​ ఐటీలో జరిగింది.

DIED
ఏలూరులో విషాదం.. నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి మృతి..!

IIIT Student Died:ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి మృతి చెందాడు. నెల్లూరుకు చెందిన నికేష్‌ రెండు సంవత్సరాల క్రితం నూజివీడు ట్రిపుల్ ఐటీలో చేరాడు. వేసవి సెలవులకు వెళ్లి తిరిగి వచ్చిన నికేష్‌ వసతి గృహంలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. తోటి విద్యార్థులు గమనించి వసతి గృహ పర్యవేక్షకులకు తెలియజేశారు. వారు ఆ విద్యార్థిని నూజివీడు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం చేస్తుండగా విద్యార్థి మృతి చెందాడు. దీనిపై నూజివీడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details