ఆంధ్రప్రదేశ్

andhra pradesh

FIRE ACCIDENT: షాపింగ్​మాల్​లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

By

Published : Aug 18, 2021, 9:22 AM IST

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని ఆనంద్​ షాపింగ్​ మాల్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే.. 4 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. రెండు ఫైర్​ ఇంజిన్​ల సహాయంతో రెండు గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపు చేశారు.

fire-accident
fire-accident

షాపింగ్​మాల్​లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని ఆనంద్ షాపింగ్ మాల్ అగ్నిప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు గమనించి దుకాణ యజమానికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని... అగ్ని మాపక అధికారులకు సమాచారం అందించారు.

అగ్నిమాపక వాహనం వచ్చేసరికి కింది అంతస్తు పూర్తిగా పూర్తిగా కాలిపోయింది. చూస్తుండగానే నాలుగు అంతస్తుల్లోకి మంటలు వ్యాపించాయి. పెద్దఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. రెండు అగ్నిమాపక వాహనాలతో మంటలు ఆర్పినా ఫలితం లేకుండా పోయింది. మంటలు భారీగా ఎగసిపడడంతో వాతావరణంతా దట్టమైన పొగతో నిండిపోయింది. స్థానికులంతా తీవ్ర భయాందోళకు గురయ్యారు. ఆస్తి నష్టం భారీగా జరిగింది. ప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details